కరోనా మహమ్మారి .... ప్రస్తుతం దేశంలో చాలా వేగంగా విజృంస్తుంది. రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ..తగ్గడంలేదు. దీనితో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్ డౌన్ ను అమలు చేయడంలో పోలీసులది ప్రముఖ పాత్ర. పోలీసులు తమ కుటుంబాలని వదిలి , ప్రాణాలని పనంగా పెట్టి విధుల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఆరోగ్యంపై, వారి ప్రాణాలపై దృష్టి సారించారు పోలీసు బాసులు.
24 గంటల పాటు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే వారి వ్యక్తిగత ప్రాణాలను రక్షించుకోవాల్సిన పరిస్జితి పోలీసులది. ఒకవైపు డ్యూటీ చేయాలి మరోవైపు తమ ప్రాణాలని సైతం కరోనా నుండి కాపాడుకోవాలి. అందుకే వారిని రక్షించుకునేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని భావించారు పోలీసు బాసులు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలను చేపట్టింది.
ఇందులో భాగంగా కరోనా వైరస్ వాహనాల ద్వారా వ్యాప్తి చెందకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పరికరంతో ఫాగ్ శానిటైజేషన్ చేస్తున్నారు హైదరాబాద్ నగర పోలీసులు. ప్రతి పోలీసు వాహనంలో ఫాగ్ శానిటైజేషన్ చేయిస్తున్నారు. దాని వలన వచ్చే మూడు నెలల వరకు ఎలాంటి బ్యాక్టీరియా వాహనాల్లోకి చేరదన్న ఉద్దేశంతో ఫాగ్ శానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఫాగ్ శానిటైజేషన్ శుక్రవారం నుంచి ప్రారంభించారు.