షీనాబోరా.. ఇంద్రాణి ముఖర్జియా., ఈరెండు పేర్లు కొంత కాలం నుంచీ దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఎన్నో మలుపులు..షీనా బోరాని ఎవరు చంపారో తెలియదు... అది హత్య అని కొందరు.. ఆత్మహత్య అని మరికొందరు... దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్యకు గురైనట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ముంబై సరిహద్దులోని రాయ్ గఢ్ అడవిలో లభ్యమైన మృతదేహం షీనాబోరా(24)దే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం నిర్ధారించింది.
ఎయిమ్స్ ఫోరెన్సిక్ నివేదికను సీబీఐ అధికారులకు సమర్పించింది. ఈ రిపోర్టు ఆధారంగా షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితులైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా - ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా - కారు డ్రైవర్ శ్యామ్ వర్ సింగ్ లపై ఛార్జీ షీట్ నమోదు చేయనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ దక్షిణ ముంబై మెట్రోపాలిటన్ కోర్టు పరిధిలో వీరిపై ఛార్జీ షీట్ దాఖలు చేస్తామని, ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను ఇందులో పేర్కొంటామని సీబీఐకి చెందిన ఓ అధికారి వివరించారు. ఈ ముగ్గురికీ కోర్టు నవంబర్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, 2012 ఏప్రిల్ లో షీనాబోరా హత్యకు గురైంది. షీనాబోరాను తానే హత్య చేయించినట్టు ఇంద్రాణి పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.