భూకబ్జా ఆరోపణలతో వైద్య ఆరోగ్యశాఖను కోల్పోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అడుగులు ఇప్పుడు ఎటువైపు పడుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని తర్వలోనే ఈటల రాజేందర్ కలువనున్నారని కరీంనగర్ జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటలను బీజేపీలోకి రప్పించడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈటలను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలోకి తీసుకురావాలని బీజేపీ పెద్దలు కూడా యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం ఈటలతో ఫోన్ లో మాట్లాడినట్టు ప్రచారం సాగుతోంది.
రాజకీయ సమీకరణాలన్నీ కుదిరితే బీజేపీలో ఈటల చేరే అవకాశం ఉందట.. చూడాలి మరీ టీఆర్ఎస్ నుంచి ఇంకా తీసేసినట్టు కేసీఆర్ అయితే ప్రకటించలేదు. ఆయన మంత్రి శాఖను మాత్రం తొలగించారు. పార్టీ నుంచి మాత్రం ప్రకటన రాలేదు. దీంతో ఈటల టీఆర్ఎస్ లో కొనసాగుతారా? లేదా అన్నది చూడాలి.