సీనియ‌ర్ నేత ఎంట్రీతో ఒరిగేదేంటి... జ‌న‌సేన‌లో చ‌ర్చ‌...!

Update: 2023-01-05 13:30 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు. సో.. నాయ‌కుల‌నుకానీ, పార్టీల‌ను కానీ ఏమీ అనే అస‌వ‌రం లేదు. ఎవ‌రికి ఉన్న అవ‌కాశాలు, అవ‌స‌రాలు.. అనేవి పార్టీల‌ను, నేత‌ల‌ను ప్ర‌ధానంగా ప్ర‌భావితం చేస్తాయి. ఇప్పుడు ఇదే కోవ‌లో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయణ కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. త్వ‌ర‌లోనే ఆయ‌న జ‌న‌సేన‌లో చేర‌నున్నారు. వాస్త‌వానికి బీజేపీ-జ‌న‌సేన‌తో పొత్తులోనే ఉంది.

అయితే.. కొన్నాళ్లుగా త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోతోంద‌ని.. సోము వీర్రాజు త‌న‌ను పూచిక పుల్ల‌లా చూస్తున్నార‌ని క‌న్నా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన‌వైపు చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. జ‌న‌సేన పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన క‌న్నా.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి వెళ్తున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఇప్ప‌టికే మంత‌నాలు కూడా పూర్త‌య్యాయ‌ని.. ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. త‌న‌కు మంత్రి ఇవ్వాల‌నే ష‌ర‌తుతోనే ఆయ‌న పార్టీ మార్పున‌కురెడీ అయ్యార‌ని అనుచ‌రులు అంటున్నారు. ఇదిలావుంటే, అస‌లు క‌న్నా రాకపై జ‌న‌సేన నేత‌లు ఏమంటున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. క‌న్నా వ‌ల్ల జ‌న‌సేన‌కు ఒరిగేది ఏమీలేద‌ని అంటున్నారు. ఎందుకంటే..ఆయ‌నకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల‌ను క‌దిలించే శ‌క్తి లేద‌న్న‌ది జ‌న‌సేన టాక్‌.

అదే స‌మ‌యంలో సీనియ‌ర్లు కూడా ఆయ‌న వెంట న‌డిచి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. అదే జ‌రిగి ఉంటే.. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ క‌నీసం ఒక‌టో రెండో స్థానాల‌ను అయినా గెలుచుకునేద‌ని చెబుతున్నారు. అయితే.. క‌న్నా సీనియ‌ర్ కాబ‌ట్టి.. ప్ర‌జ‌ల్లోకి జ‌న‌సేన విష‌యంలో మంచి సంకేతాలు వెళ్తాయ‌ని మాత్రం నాయ‌కులు ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నారు.

అదే స‌మ‌యంలో క‌న్నా పార్టీలోకి వ‌చ్చినా.. గుంటూరు జిల్లాలో పెద్ద‌గా మార్పులు ఉండే అవ‌కాశం లేదేని అంటున్నారు. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన ఎలానూ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు. సో.. క‌న్నాకు వ్య‌క్తిగ‌తంగా ప్ర‌యోజ‌నం చేకూరుతుందే త‌ప్ప‌.. పార్టీపరంగా ఆయ‌న వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌నేవారి సంఖ్య జ‌న‌సేన‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

మ‌రోవైపు.. క‌న్నా అనుచ‌రులు మాత్రం త‌మ నాయ‌కుడు జ‌న‌సేన‌లోకి వెళ్తే.. భారీ సంఖ్య‌లో నాయ‌కులు వెళ్తార‌ని చెబుతున్నారు. పార్టీకి గుంటూరులో మంచి ఊపు వ‌స్తుంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. క‌న్నా రాజ‌కీయం.. జ‌న‌సేన‌లో ఆస‌క్తిగా మార‌నుంద‌నేది వాస్త‌వం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News