నేను అవినీతి చేశానంట‌.. వాణ్ని అరెస్టు చేయండి.. : మాజీ మంత్రి వెల్లంప‌ల్లి ర‌భ‌స‌

Update: 2022-06-18 09:30 GMT
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న 'గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం' కార్య‌క్ర‌మం ర‌సాభాస‌గా మారుతోంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌ని వారు.. ప్ర‌భుత్వం త‌మ‌కు ఏదో చేస్తుంద‌ని ఆశించిన వారు అవేవీ త‌మ‌కు అంద‌క పోవ‌డంతో ఒకింత ఆవేద‌న‌తో ఉన్నారు.

ఈ స‌మ‌యంలో త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. నేత‌ల‌ను వారు నిల‌దీస్తున్నారు. అయితే.. కొన్ని చోట్ల స‌ర్దుకు పోతుండ‌గా.. మ‌రికొన్ని చోట్ల మాత్రం వివాదం అవుతున్నాయి. తాజాగా గడప గడపకు కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50 వ డివిజన్ లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఓ యువ‌కుడు.. త‌మ ఇంటికి వ‌చ్చిన వెల్లంప‌ల్లిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 10 వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్నార‌ని.. మాకు ఏం చేశార‌ని ఆ యువ‌కుడు ప్ర‌శ్నించారు. దీంతో ఒక్క‌సారిగా ఆగ్ర‌హంతో ఊగిపోయిన వెల్లంప‌ల్లి.. వెంట‌నే ప‌క్క‌నే ఉన్న సీఐని పిలిచి.. "వాడు నామీదే ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు.. అరెస్టు చేయండి" అని హుకుం జారీ చేశారు.

ఈ సంద‌ర్భంగా యువ‌కుడి కుటుంబం .. అత‌నికి ఏమీ తెలియ‌ద‌ని.. ఏదో చిన్న‌వ‌య‌సు అని చెబుతున్నా.. వెల్లంప‌ల్లి మాత్రం ప‌ట్టించుకోకుండా.. యువ‌కుడిని అరెస్టు చేయాలంటూ.. ఆదేశించారు.

వాస్త‌వానికి ప్ర‌జ‌ల నుంచి ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌స్తాయ‌ని.. ముందుగానే గ్ర‌హించిన సీఎం జ‌గ‌న్‌.. నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల‌ని.. సూచించారు. ఎవ‌రూ కూడా నోరు జారొద్ద‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా ఉండాల‌ని.. వ‌చ్చే ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అన్ని కోణాల్లోనూ వివ‌రించాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు మాత్రం దూకుడు త‌గ్గించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామంలో ఈ నెల 15న నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణపై దాడి చేసేందుకు యత్నించారనే అభియోగంపై  ఐదుగురు గిరిజనులను అరెస్టు చేసినట్టు సీఐ జేడీ బాబు తెలిపారు. ఈ కేసులో గోమంగి మధుసూదనరావు(50), గోమంగి అడ్డి(43), గోమంగి బుద్దు(30), గోమంగి శారద(33), గోమంగి గాసి(32)లను అరెస్టు చేశామన్నారు. వీరిని రిమాండ్‌కు కూడా తరలించినట్టు ఆయన చెప్పారు.





Full View

Tags:    

Similar News