కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీ ఎంపీ నంది ఎల్లయ్య తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించారని సమాచారం. తాజాగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. దీనితో కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఐతే... నంది ఎల్లయ్యకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇన్నాళ్లూ కరోనా లేదు కాబట్టి...అవి ఆయన్ని ఎక్కువగా బాధించలేకపోయాయి. కానీ కరోనా వచ్చిన తర్వాత ఆ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టాయి. ఆ క్రమంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో నంది ఎల్లయ్య మరణించినట్లు కుటుంబ సబ్యులు తెలిపారు.
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడి గానూ ఆయన పని చేశారు. సిద్దిపేట లోక్ సభ స్థానం నుంచి ఐదుసార్లు పార్లమెంట్ కు ఎన్నిక కాగా - నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దీనితో రాంనగర్ లో ఆయన ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. నంది ఎల్లయ్య మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే , టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఏఐసీసీ ఇంచార్జి ఆర్.సి కుంతియా - సీఎల్పీ నేత భట్టి విక్రమార్క - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ - ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ - మాజీ మంత్రి డీకే సమరసింహరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు