తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టుగా అభివర్ణించే రైతు బంధు పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఈ పథకాన్ని ప్రశంసించే వారు ఉన్నట్లే.. వేలెత్తి చూపించేవారు లేకపోలేదు. మొత్తంగా ఇలాంటి పథకం ఉండాల్సిందేనని చెబుతూనే.. కొన్ని మార్పులు చేర్పులను ప్రస్తావిస్తుంటారు. ఈ పథకంపై కొందరు చేసే వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటాయి. దేశంలోని మరే రాష్ట్రంలో లేనట్లుగా.. ఒక ముఖ్యమంత్రికి.. తమ పక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రికి సంక్షేమ పథకంలో భాగస్వామిని చేసిన సత్తా సీఎం కేసీఆర్ సొంతంగా చెప్పక తప్పదు.
చట్టం ముందు సంపన్నుడైనా.. సామాన్యుడైనా ఒక్కటే అన్న మాట వినిపించినా.. ఆచరణలో మాత్రం అలాంటివి కనిపించవన్న సంగతి తెలిసిందే. కానీ.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎవరికైనా.. ఎంతటి వాడికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అమలు చేయటం ద్వారా సంక్షేమ పథకాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేశారని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పథకాన్ని ఐదు ఎకరాల భూమి ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి సాయంగా వర్తింపజేయాలని పిటిషనర్ కోరారు. గతంలోనూ ఇదే పథకంపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన న్యాయవాది తల్లాడ నందకిశోర్ ఒక పిల్ దాఖలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉందని.. ఇందులో మెజార్టీ వ్యవసాయ భూములను కౌలుదారులే సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే.. కౌలుదారులకు ఎలాంటి పరిహారం ఇవ్వటం లేదని.. రాజకీయ నేతలకు వందలాది ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని.. వీరికి రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం అందుతోందని.. ఈ నేపథ్యంలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గతంలో దాఖలైన పిటిషన్లతో కలిసి విచారించనుంది. విచారణకు స్వీకరించిన కోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి.. రెవెన్యూ.. వ్యవసాయ.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు వ్యవసాయ శాఖ కమీషనర్ లకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలో మూడు పిటిషన్లను కలిపి విచారణ జరపనున్నట్లు చెబుతున్నారు.