ఢిల్లీలో మరింతగా పెరిగిన వాయు కాలుష్యం

Update: 2021-11-08 07:30 GMT
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడం వల్ల దిల్లీలో వరుసగా మూడో రోజు గాలి నాణ్యత క్షీణించింది. దిల్లీలో వాయునాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది. మొత్తంగా దేశరాజధానిలో గాలినాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.

దిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్.. 466 పాయింట్లతో అత్యంత కాలుషితమైన ప్రాంతంగా నమోదైంది. ఐఐటీ దిల్లీ ప్రాంతంలో(441), లోధి రోడ్డు(432), పూసా రోడ్డు(427) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.దిల్లీ విమానాశ్రయం, ఇండియా గేట్ ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరిగిపోయి ఆకాశంలో పొగమంచు పొరలా ఆవరించింది. దీంతో ట్రాఫిక్‌ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.దిల్లీలో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు కేజ్రీవాల్‌ సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది.

రహదారుల మీద నీటిని చల్లేందుకు వాటర్ ట్యాంకర్లను మోహరించింది. స్మాగ్ గన్స్‌ ను ఏర్పాటు చేసి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడం వల్ల దిల్లీలో వరుసగా మూడో రోజు గాలి నాణ్యత క్షీణించిందని తెలుస్తోంది. దిల్లీలో వాయు నాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెట్స్ 530కు చేరడంతో గాలి పీల్చడానికి ప్రమాదకంగా మారింది. దీనిపై పర్యావరణ వేత్తలు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలో గాలి కాలుష్యానికి మానవ నిర్లక్ష్య ధోరణి కారణమని అంటున్నారు. ఏఎన్ఐతో ప్రముఖ పర్యావరణవేత్త విమ్లెందు ఝా మాట్లాడారు. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మృతి చెందుతున్నారని తెలిపారు. వాయుకాలుష్యం కారణంగా దిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 9.5 సంవత్సరాలు తగ్గిపోతుందని ఒక నివేదికలో తేలిందన్నారు. వాయు కాలుష్యంతో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆస్తమా(ఉబ్బసం)తో బాధపడుతున్నారని లంగ్ కేర్ ఫౌండేషన్ పరిశోధనలో తెలిసిందని విమ్లెందు తెలిపారు.


Tags:    

Similar News