దేశంలోనే ధనిక మంత్రిగా ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. మరి... ఏపీలో అత్యంత రిచ్ నియోజకవర్గం ఏంటో తెలుసా? నవ్యాంధ్ర నడిబొడ్డున ఉన్న విజయవాడలోని నియోజకవర్గాలా.. లేదంటే కొత్త రాజధాని ప్రాంత కానిస్టెన్సీలా... ఏమై ఉంటాయి..?
ఇవేమీ కావు.. ఏపీలోని రిచ్ నియోజకవర్గం విశాఖపట్నంలో ఉంది. అవును.. ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ధనిక నియోజకవర్గంగా గాజువాక రికార్డు సృష్టించింది. అక్కడి ప్రజల తలసరి ఆదాయం రూ.2,64,332గా ఉందట. ఏపీలో ఇంకే నియోజకవర్గంలోని ప్రజల ఆదాయం ఈ స్థాయిలో లేదు. దీంతో గాజువాక టాప్ లో నిలిచింది.
రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం అందుకు సంబందించిన వివరాలు విడుదల చేసింది. ఆ నియోజకవర్గంలో పరిశ్రమలు - వ్యవసాయం - సర్వీసెస్ - ప్రొడక్టివిటీ వంటివన్నీ లెక్కించింది. దాని ప్రకారం పర్ కేపిటా ఇన్ కమ్ లెక్కించింది. అందులో గాజువాక టాప్ లో నిలిచింది. జిల్లాలవారీగా చూసినా విశాఖ 1,24,171 రూపాయల తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా 1,22,773 రూపాయాల ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. అన్నిటికంటే చివరగా అట్టడుగున విజయనగరం ఉంది. అక్కడ తలసరి ఆదాయం రూ.76,623.
కాగా విశాఖ జిల్లా - గాజువాక నియోజకవర్గం కంటే గాజువాక మండలం మరింత టాప్ లో ఉంది. ఆ మండల తలసరి ఆదాయం రూ.3,86,311. ఇక్కడ స్టీల్ ప్లాంట్ - భెల్ వంటివి ఉండడంతో ఉద్యోగులు - అధిక వేతన వర్గాలు నివసిస్తుండడంతో తలసరి ఆదాయం భారీగా ఉందని తేలింది.