వ్యాపారాల్లో అక్రమాలకు ఇబ్బందులు ఉంటాయన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే.. మోతాదు మించిన ఖర్చుతోనూ తిప్పలు మరీ ఇంతలా ఉంటాయా? అన్న ఆశ్చర్యం అక్రమ గనుల కేసుల్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. కూతురు పెళ్లిని తన స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ఆయన పడిన తపన.. ఇప్పుడు సరికొత్త తలనొప్పులు తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తన కుమార్తె బ్రాహ్మణిని.. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్తకు ఇచ్చి వివాహం జరపటం తెలిసిందే.
ఈ సందర్భంగా నింగి.. నేల కలిసే తీరులో ఘనంగా పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈ పెళ్లిని మీడియా సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. భారీ స్థాయిలో జరిగిన ఈ పెళ్లికి ఉన్నత రాజకీయ నేతలు కాస్త దూరంగా ఉన్నా.. సనీ ప్రముఖులు.. సెలబ్రిటీలు మాత్రం భారీగా హాజరయ్యారు. అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో ఒకటిగా చెబుతున్న ఈ పెళ్లికి రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉంటే.. పెళ్లి వేడుక హడావుడి ఒక కొలిక్కి రాక ముందే.. ఐటీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న గాలి.. తాజాగా ఆ శాఖ అధికారులు సంధించిన ప్రశ్నలకు తల పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తన కుమార్తె పెళ్లి కోసం పెట్టి ఖర్చుకు సంబంధించిన ప్రతి పైసాకు లెక్క ఉన్నట్లుగా చెబుతూ.. కూతురు పెళ్లి కోసం ఆస్తుల్ని తనఖా పెట్టిన మరీ చేసినట్లుగా చెబుతున్నట్లు తెలుస్తోంది.
అయితే.. గాలి మాటల్ని పెద్దగా పట్టించుకోని ఐటీ అధికారులు ఆయనకు ప్రశ్న మీద ప్రశ్న వేసి ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా తెలుస్తోంది. ఒకప్రశ్నకు సమాదానం చెప్పేటప్పటికి మరో ప్రశ్నను వేస్తూ.. గాలికి ఊపిరి ఆడకుండా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇన్నేసి ప్రశ్నల్ని ఏ మాత్రం ఊహించిన గాలి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇంతకాలం అక్రమ మైనింగ్ కేసుల విచారణతో ఇబ్బంది పడ్డ గాలి.. తాజాగా కూతురు పెళ్లి ఖర్చు ఆయనకు మరిన్ని తలనొప్పుల్ని తెచ్చిపెట్టినట్లుగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/