గతంలో మైనింగ్ కింగ్ గా నిత్యం వార్తల్లో నిలిచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి - ఈమధ్యకాలంలో పెద్దగా వార్తల్లో కనిపించింది లేదు. అయితే ఉన్నట్లుండి తన కూతురి పెళ్లి కార్డుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎవరూ ఊహించని రీతిలో భారీ వెడ్డింగ్ కార్డ్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి వార్తల్లో నిలిచిన గాలి జనార్ధన్ రెడ్డి కి సంబందించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తాజాగా ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనంగా ప్రచురించింది. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు తుపాకీ పాఠకులకోసం...
కర్ణాటక మాజీ మంత్రి - మైనింగ్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి కర్ణాటకలోని ప్రముఖుల్లో ఒకరు. ఈయన అక్రమ మైనింగ్ కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి - గతఏడాదే బెయిల్ పై బయటికొచ్చారు. చాలా సౌమ్యంగా మాట్లాడుతూ - వినయాన్ని ప్రదర్శించే ఈయన.. సన్నిహితుల వద్ద మాత్రం తనను తాను విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయతో పోల్చుకునే వారట.
2011లో సీబీఐ చేసిన దాడులతో గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ సంపాదన వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో గాలికి మూడు విలాసవంతమైన భవనాలు - ఇండోర్ స్విమ్మింగ్ పూల్ - 70ఎంఎం స్క్రీన్ - మసాజ్ పార్లర్ - బార్ - హోమ్ థియేటర్ ఇలా సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన భవంతులు ఉన్నాయని తేలింది. అంతేనా.. ఆ భవంతుల చుట్టూ దాదాపు అరకిలో మీటరు మేర భద్రతను పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలు ఉండేవట.
గాలి ఇంట్లో అత్యంత ఖరీదైన వస్తువులును ఈ సోధాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు ప్లేట్లు - స్పూన్స్ - ఫోర్క్స్ - కప్పులు - కుండలు - చివరికి లైటర్స్ - యాష్ ట్రేలు కూడా బంగారంతో తయారుచేసినవేనట. కేవలం వీటిని తూకం వేస్తేనే దాదాపు 30 కేజీలకు పైగానే తూగాయట.
ఇవన్నీ ఒక ఎత్తైతే గాలి వారింట్లో దొరికిన సింహాసనం ఆయన రాజభోగానికి నిదర్శనం. సుమారు 15 కిలోల బరువున్న ఈ సింహాసనాన్ని బంగారంతో తయారుచేశారు. ఈ సింహాసనానికి రూ.2.2 కోట్ల విలువైన వజ్రాలను పొదిగారు. హంపిలో జరిగిన ఓ వేడుకలో గాలి ఈ సింహాసనాన్ని అధిష్టించారు.
ఇక ఆయన ఉపయోగించే కార్ల విషయానికొస్తే... రోల్స్ రాయిస్ - రేంజ్ రోవర్ - లాండ్ రోవర్ - బెంజ్ - ఆడి - బీఎమ్ డబ్ల్యూ - వీటితో పాటు 12 స్కార్పియోలు - బొలొరోలు - ఒక విలాసవంతమైన సకల సదుపాయాలతో కూడిన బస్సు ఉన్నాయి. కార్లలో వెళ్లడం ఇష్టం లేకపోతే రుకంఇణి అని ముద్దుపేరుపెట్టుకున్న బెల్ హెలికాఫ్టర్ లో ప్రయాణించేవారు. ఆయన ఇంటికి కుడి పక్కనే ఒక హెలిప్యాడ్ ఉంది.
ఇక గాలి జనార్ధనరెడ్డి ధరించే వస్త్రాల విషయానికొస్తే... బంగారంతో తయారుచేసిన దుస్తులను మాత్రమే ఆయన ధరించేవారట. ఒక్క చొక్కా ఖరీదు కనీసం లక్ష రూపాయలు ఉంటుందని టాక్. ఇదే క్రమంలో ఆయన ధరించే బెల్ట్ సైతం బంగారంతో తయారుచేసింది కాగా దాని విలువ 13లక్షలు.
అలాగే బంగారంతో తయారుచేసిన ఒక అడుగు ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహం - ఆరు అంగుళాల పద్మావతి దేవీ విగ్రహం గాలి ఇంట్లోని పూజ గదిలో ఉన్నాయి. వాటి విలువ సుమారు 2.3 కోట్లు. అంతేకాదు - పూజ గదిలో మోగించే గంట కూడా 1కేజీ బంగారంతో తయారుచేసింది.
2007 నుంచి 2010 మధ్య కాలంలో గాలి జనార్ధన రెడ్డి సంపద అమాంతం పెరిగింది. దీనికి కారణం 29.8 మిలియన్ల ఇనుమును ఇతర దేశాలకు ఎగుమతి చేయడమేనట. ఆ ఇనుము విలువ 12,228 కోట్ల రూపాయలు. చైనా - బ్రెజిల్ - సింగపూర్ - హాంగ్ కాంగ్ దేశాలకు ఈ ఇనుమును తరలించేవారు.
ఆ సమయంలో గాలి జనార్ధనరెడ్డి ఒక్క రోజు సంపాదన 5 కోట్ల రూపాయలు ఉండేదట. ఈస్థాయిలో సంపాదించిన గాలి జనార్ధనరెడ్డి జైలు పాలు కావడానికి కారణం అక్కడి దేవత సుగ్గలమ్మ తల్లి శాపం తగలడమేనని స్థానికులు చాలామంది చెబుతుంటారు. దానికి కారణం అనంతపురానికి - బళ్లారికి సరిహద్దులో ఉన్న ఈ సుగ్గలమ్మ తల్లి గుడిని 2006లో ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ అక్రమంగా తొలగించిందట.
ఇంత రాజభోగం అనుభవించిన గాలి జనార్ధనరెడ్డికి కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా చేయడం పెద్ద లెక్కకాదేమో. ఇవి గాలి జనార్ధన రెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు రాయొచ్చని పలువురు నేతలు చెబుతున్నారట!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/