ఆ మహిళ కష్టం వింటే కడుపు తరుక్కుపోతుంది

Update: 2017-06-08 06:46 GMT
భర్తతో గొడవపడి రాత్రి వేళ పుట్టింటికి బయలుదేరిన 23 ఏళ్ల వివాహితకు జరిగిన దారుణం అందరినీ కలచివేస్తోంది. హరియాణాలోని గుర్ గావ్ కు చెందిన ఆమె భర్తతో గొడవపడి తీవ్ర ఆవేదనతో తన 9 నెలల బిడ్డను తీసుకుని సమీపంలోని ఖాండ్సా గ్రామంలోని పుట్టింటికి బయలుదేరింది. ఓ ఆటోలో ప్రయాణిస్తుండగా, ఆటో డ్రైవరు, మరో ముగ్గురు కలిసి ఆమెపై ఆటోలోనే దారుణంగా అత్యాచారం చేశారు. ఆమె బిడ్డ ఏడుస్తుండడంతో బిడ్డను రోడ్డుపైకి విసిరేశారు.
    
సామూహిక అత్యాచారం తరువాత ఆమెను రోడ్డుపై వదిలేసి పారిపోగా బిడ్డకు ఏమైందో అన్న ఆందోళనతో ఆమె వెనక్కి నడుచుకుంటూ వెళ్లి రోడ్డుపై పడున్న బిడ్డను తీసుకుని గుర్ గావ్ లోని ఓ ఆసుపత్రికి వెళ్లింది అక్కడ వారు బిడ్డ మృతి చెందినట్లు చెప్పడంతో చనిపోయిన ఆ బిడ్డను చేతిలో పట్టుకుని మెట్రో రైలెక్కి మరో ఆసుపత్రికి వెళ్లింది. అక్కడా వైద్యులు అదే చెప్పడంతో ఆమె హతాశురాలైంది.
    
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 20 ఏళ్ల ఆ ఆటో డ్రైవరును అరెస్టు చేశారు. అయితే..  బాధితురాలు వైద్యపరీక్షలకు నిరాకరిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా అత్యాచారానికి గురై... ఆపై 9 నెలల చిన్నారి మృతదేహంతో మెట్రోరైలులో ప్రయాణించిన ఆ మహిళ కష్టాన్ని విన్నవారంతా అయ్యో పాపం అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News