కొడిగట్టిన దీపంలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మార్చేసిన నాయకులు...ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ బీజేపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో పెద్ద ఎత్తున నేతలు కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆప్తుడనే పేరున్న ఎంపీ గరికపాటి మోహన్ రావు చంద్రబాబు గురించి, పార్టీ గురించి తమమ మమకారం చాటుకున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి పనిచేశామని..కష్టకాలంలో పార్టీ చాలా ఆదుకుందన్నారు.
ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో టీడీపీలో చేరానని గరికపాటి తెలిపారు. ``తెలుగుదేశంలో అనేక పదవులు అనుభవించాను. ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు వెంట పార్టీ కోసం కష్టపడ్డాం. బాబ్లీ కోసం ఎంతమంది వీపులు పగిలాయో మీ అందరికీ తెలుసు...ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక...చంద్రబాబు అక్కడ బాగా బిజీ అయిపోయారు..కానీ తెలంగాణ టీడీపీ ఏ విధంగా పనిచేసిందో మీకు తెలుసు...అసలు టీటీడీపీని కొనసాగించాలా మూసివేయాలా అనే పరిస్థితి వచ్చింది. అనేక సార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాను. అయితే ఆయన బిజీగా ఉండడం వల్ల దృష్టి సారించలేకపోయారు`` అని అక్కడి పరిస్థితులను వివరించారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి తెలంగాణ టీడీపీ టికెట్ నిరాకరించిందని గరికపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ``పార్టీ పని కోసం పనికి వచ్చిన నేతలు పోటీకి పనికిరారా అని అప్పుడే ప్రశ్నించా. తెలంగాణలో టీడీపీకి బలం ఉన్నా పోటీ చేయలేదు. ఏపీలో తెలుగుదేశం బాగుండాలని కోరుకుంటున్నా. చద్రబాబును నిందించదలుచుకోలేదు. పదవుల కోసం కాదు బీజేపీ గెలుపు కోసం బీజేపీలో చేరుతున్నాం.. టీడీపీలో నష్టపోయిన నేతలకు బీజేపీలో న్యాయం చేస్తా...` అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గరికపాటి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.