మగవాళ్లను మిస్టర్ అని... ఆడవాళ్లలో పెళ్లయినవారికైతే మిసెస్ అని, పెళ్లికాని వారికి మిస్ అని అంటారు. మరి ఆడ - మగ కాని తృతీయ వర్గానికి ఏమంటారు? చాలాకాలంగా ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే.. ఇకపై దీనికి కూడా కొత్త ప్రిఫిక్సు రానుంది. ఎంఎక్స్ అనే కొత్త ప్రిఫిక్స్ ను ట్రాన్స్ జెండర్లకు వాడాలని చాలాదేశాలు తలపోస్తున్నాయి. దీన్ని మక్స్ అని పిలుస్తారు.
ఏడాది కిందటే ఈ ప్రతిపాదన వచ్చినా ఇంకా అమల్లోకి రాలేదు. కొన్ని దేశాలు దీన్ని అమల్లోకి తేవాలని చూస్తున్నాయి. అయితే, అది అంతగా నప్పే పదం కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ట్రాన్సు జెండర్లు తమకు గుర్తింపు లేదని ఆవేదన చెందుతుంటారు. జనాభా లెక్కల్లోనూ ఆడ - మగ అన్న వర్గాలే ఉంటాయి కానీ తమ గురించి ప్రస్తావన ఉండదని.. ఇతరులు అనడమే తప్ప ఇంకేమీ అనడం లేదని వాదిస్తుంటారు. విదేశాల్లోనూ ఇదే వాదన ఉంది. మిష్టర్ - మిసెస్ - మిస్ మాదిరిగా తమకూ ఒక ప్రిఫిక్సు ఉండాలన్నది వారి కోరిక. ఇది అమల్లోకి వస్తే వారి కోరిక నెరవేనుంది.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ పదాన్ని వాడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తాజాగా తమ ప్రచురణలో ఈ పదాన్ని చేర్చింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చే అవకాశం ఉంటుంది.