నెలన్నర పాటు దేశవ్యాప్తంగా మూతపడి ఉన్న బంగారు దుకాణాలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో బంగారు వర్తకులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. మంగళవారం దేశవ్యాప్తంగా దాదాపు సగం దుకాణాలు తెరుచుకున్నాయి. రేపటికి అన్ని షాపులూ ఓపెన్ అవుతాయని భావిస్తున్నారు. ఇటీవలి బడ్జెట్లో అన్ని బంగారు లావాదేవీలపై కేంద్రం ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్ను విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాదాపు ఆరు వారాలుగా బంగారు వర్తకులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె వారం పది రోజుల్లో ముగిసిపోతుందని అంతా భావించారు.
ఐతే కేంద్రం పన్ను విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దన్న నిర్ణయానికి రావడంతో బంగారు వర్తలకు ఏమీ పాలుపోని పరిస్థితి వచ్చింది. ఈ నెలన్నర రోజుల్లో వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. మొన్న ఏప్రిల్ 8న గుడి పడ్వా సందర్భంగా ఒక్క రోజే దేశవ్యాప్తంగా బంగారు వర్తకులు రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు అంచనా. ఇప్పటికీ కేంద్రం ఆ పన్నును రద్దు చేయలేదు. ఐతే బంగారు వర్తకులు ఆందోళన చెందుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల వేధింపులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చిందంతే. భారీగా ఆదాయం కోల్పోతున్న నేపథ్యంలో ఈ మాత్రమైనా ఊరట దక్కిందని వర్తకులు సమ్మెకు తెరదించారు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా భాజపానే ఈ ఎక్సైజ్ పన్నును వ్యతిరేకించి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే పన్ను విధించడం గమనార్హం.