కేంద్ర బడ్జెట్ ఈసారి ప్రజలకు ఆశజనకం గానే ఉంది. ఆదాయపన్ను చెల్లింపు లో పలు మార్పులు తీసుకొస్తూ మధ్య, ఎగువ తరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయాలు ఉన్నాయి. ఈ మేరకు వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల లో మార్పులు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను చెల్లింపు దారులకు ఊరట కల్పించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కొత్త వ్యక్తిగత ఆదాయపన్నుల శ్లాబులను ప్రకటించారు. మధ్య, ఎగువ మధ్య తరగతివారికి ఊరటనిచ్చేలా ఈ శ్లాబులు ఉండటంతో ప్రధాన చర్చ దీనిపై కొనసాగుతోంది.
కొత్త పన్ను శ్లాబ్స్ ఇలా..
ఆదాయం రూ. 5లక్షల నుంచి 7.5 లక్షలు ఉన్న వారికి 10 శాతం పన్ను
రూ. 7.5లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను
రూ. 12.5 లక్షల ఆదాయం వరకు 25 శాతం పన్ను
రూ. 15 లక్షల ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే 30 శాతం పన్ను
వీటితో పాటు కొత్త ఆదాయ పన్ను విధానం తప్పనిసరి కాదు ఐఛ్చికమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవులపై ఆధారపడి ఉంటుందని వివరించారు. దీంతో పాత విధానంతోపాటు కొత్త విధానం కూడా అమల్లో ఉంటుంది.
ప్రత్యక్ష పన్నుల విధానం లో భారీ సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను లేకపోవడంతో సామాన్యులకు ఇది తీపి కబురే. సామాన్యుడు కోరుకున్న విధంగా పన్ను మినహాయించడంతో మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు ఏడాది పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం గమనార్హం. కంపెనీలపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు, రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఆడిటింగ్ మినహాయింపు తదితర నిర్ణయాలతో కేంద్ర బడ్జెట్ తో కొంత ఆశాజనకంగా ఉంది.
బ్యాంకింగ్ రంగానికి ఊతం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న బ్యాకింగ్ రంగానికి కేంద్రం తీపు కబురు అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 3.5 లక్షల కోట్ల మూలధన సాయం అందిస్తున్నట్లు కేంద్రమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. డిపాజిట్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కంపెనీ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకింగేతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు అదనపు నిధులు కేటాయింపునకు కొత్త పథకం తీసుకొస్తున్నట్లు చెప్పడంతో బ్యాంకింగ్ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీ ల్లో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు అవకాశం కల్పిస్తున్నామని, ఆర్థిక ఒప్పందాల పర్యవేక్షణకు కొత్త తీసుకొస్తున్నట్లు వివరించారు.