తొందరలోనే గొటబాయ రాజీనామా ?

Update: 2022-04-21 04:20 GMT
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేయక తప్పేట్లు లేదు. రాజపక్సే పరిపాలన కారణంగానే దేశం సంక్షోభంలోకి కూరుకుపోయిందంటు జనాలు కొద్దిరోజులుగా రోడ్లపైన ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశాన్ని సంక్షోభంలోని నెట్టేసిన రాజపక్సే వెంటనే రాజీనామా చేయాలని దేశంలోని జనాలు డిమాండ్లు చేస్తున్నారు. సరే వీళ్ళ డిమాండ్లకు అధ్యక్షుడు తలొంచి నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తారని ఎవరు అనుకోవడం లేదు.

ఎందుకంటే 17 మంది ఎంపీలతో కొత్త క్యాబినెట్ ఏర్పాటుచేసిన గొటబాయ దేశంలోని పరిస్దితులు చక్కదిద్దేందుకు కొంత సమయం ఇవ్వాలని జనాలకు విజ్ఞప్తి చేశారు. దీంతోనే రాజీనామా చేసే ఆలోచన రాజపక్సేకి లేదని అర్ధమైపోయింది.

అయితే అద్యక్షుడికి మద్దతిస్తున్న పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్న కారణంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిపోతోంది. తాజాగా రాజపక్సేకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ముగ్గురు ఎంపీలు ప్రకటించారు.

ఇప్పటికే 39 మంది ఎంపీలు మద్దతు ఉపసంహరించుకున్నారు. 225 ఎంపీ సీట్లున్న పార్లమెంటులో రాజపక్సేకు ఒకపుడు 156 మంది ఎంపీల మద్దతుండేది. కానీ ఇపుడు 42 మంది ఎంపీల మద్దతును కోల్పోయారు. దీంతో ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతోంది. దాయాది దేశం పాకిస్ధాన్లో కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఇలాగే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే రెండుదేశాల్లోను మిత్రపక్షాలు తమ మద్దతును ఉపసంహరించుకున్న కారణాలు వేర్వేరు.

సో శ్రీలంకలో జరుగుతున్న పరిణామాల కారణంగా తన ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతోందని రాజపక్సేకి అర్ధమైపోయినట్లుంది. అందుకనే పార్లమెంటులో బలం నిరూపించుకునేందుకు ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వ పగ్గాలు అప్పగించేందుకు రాజపక్సే సిద్ధంగా ఉన్నారని స్పీకర్ మహీంద్ యాప అబేయ్ వర్ధన్ ప్రకటించారు. అంటే పార్లమెంటులో తగిన బలం లేని కారణంగా మాత్రమే అధ్యక్షుడిగా రాజీనామాకు రాజపక్సే రెడీ అవుతున్నట్లు అర్ధమవుతోంది.

నిజానికి ఈ సమయంలో ప్రభుత్వ పగ్గాలను ఎవరు అందుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. కాకపోతే జనాల ఆగ్రహం మరింతగా పెరిగిపోకుండా రాజపక్సే అధ్యక్ష స్థానం నుండి పక్కకు తప్పుకోవటం ఉత్తమమని అనుకోవాలి.
Tags:    

Similar News