ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొత్త పార్టీలో ఉన్న పరిస్థితుల గురించి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. తన చేతిలో ఓడిపోయిన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంతో కలవాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గొట్టిపాటి రవి ప్రకటించారు. అభివృద్ధి తప్ప హత్యారాజకీయాలు లేవని బలరాం చెప్పడం పెద్ద జోక్ అన్నారు. తను పార్టీ మారేందుకు దారితీసిన పరిస్థితులు - ప్రస్తుతం టీడీపీలో ఉన్న వాతావరణం గురించి రవి సుదీర్ఘంగా వివరించారు.
అధికారం కోసమే పార్టీలు మారారనే ప్రచారాని గొట్టిపాటి రవికుమార్ కొట్టిపారేశారు. అధికారం ఉన్నా… లేకున్నా… ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంతో రాజకీయంగా మాకు మంచి సంబంధాలున్నాయని తన తండ్రి - వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి పనిచేశారని గుర్గుచేసుకున్నారు. తనకు తెలియకుండానే నియోజకవర్గంలో వైఎస్ ఆర్సీ కార్యక్రమాలు జరిగాయని, అవి జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యతో పాటు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీ మారనని వివరించారు. తన 12 ఏళ్ల రాజకీయ జీవితంలో దాడులు - భయాలు ఎన్నో చూశానని రవి చెప్పుకొచ్చారు. వారసత్వంగా తాను గ్రానైటు వ్యాపారం చేస్తున్నానని… ఎక్కడైనా గ్రానైట్ వ్యాపారంలో జరిమానా కట్టాల్సి ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను పార్టీ మారినా అన్ని వర్గాల ప్రజలు నా వెంటే ఉన్నారని గొట్టిపాటి రవి చెప్పారు. రాజీనామా చేసి మళ్లీ పోటీచేయమని సీఎం చంద్రబాబు చెబితే రాజీనామా చేసేందుకు సిద్ధమని గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. రాజీనామా చేసి పోటీచేస్తే దగ్గరుండి గెలిపించడానికి కరణం బలరాం వెన్నుపోటు పొడుస్తారని భయపడుతున్నారా అన్న ప్రశ్నకు రాజకీయాల్లో అవన్నీ కామన్ కదా అంటూ తేల్చేశారు.
కేసులు - హత్యారాజకీయాలకు బయపడి పార్టీ మారిందేమీ లేదు… ఎవరూ శాశ్వతంగా ఉండరుకదా అని రవి వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారినా అన్ని వర్గాల ప్రజలు నా వెంటే ఉన్నారని గొట్టిపాటి రవి చెప్పారు. అవసరమైతే ఇంట్లోనైనా కూర్చుంటానే తప్ప హత్యా రాజకీయాలు చేసే వారితో కలిసి పనిచేసేది లేదన్నారు. అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరికి సాక్షాలు లేకుండా చేసిన చరిత్ర కరణం బలరాందని ఆరోపించారు. మహానాడు వేదికగా అనుభవం ఉన్న రాజకీయ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తే నవ్వొచ్చిందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.