ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఇటీవల భారత్ లో అమలవుతున్న పన్ను విధానం గురించి ట్వీట్ చేశారు. ఇండియాలో దిగుమతి సుంకం ఎక్కుగా ఉందని, దాన్ని తగిస్తే.. టెస్లా ఎస్‌ప్లెయిడ్ కార్లను భారత్ కు తీసుకొస్తామని ట్వీట్ చేశారు. దీనిపై ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే...
ఇతర దేశాల్లోని వస్తువులను తమ దేశంలోకి అనుమతివ్వడానికి ఏ దేశమైనా కొంత పన్ను విధిస్తుంది. అది.. ఆయా దేశాల విధానాలను బట్టి ఉంటుంది. మన దేశంలో లగ్జరీ కార్లకు సంబంధించి పన్ను విధానం ఎలా ఉందంటే.. 40 వేల డాలర్ల లోపు కారు ధర ఉంటే.. ఆ ధరలో 60 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కారు ధర 40వేల డాలర్లకు పైన ఉంటే.. ఆ ధరకు సమానంగా (వంద శాతం) పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ దిగుమతి సుంకమే చాలా ఎక్కువగా ఉందన్నారు మస్క్. ప్రస్తుతం ఇండియాకు తెస్తామని చెబుతున్న ఎస్ ప్లెయిడ్ కారు ధర.. భారత కరెన్సీలో కోటి రూపాయలకు పైమాటే. అంటే.. పన్నుతో కలిసి రెండు కోట్లపైగానే చెల్లించాల్సి ఉందన్నమాట. దీన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.
తాము తయారు చేసే ఎలక్ట్రిక్ కార్లను లగ్జరీ కార్లుగా భావించొద్దని, కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేసే కారుగా గుర్తించి, పన్ను తగ్గించాలని కోరుతోంది టెస్లా కంపెనీ. ఈ మేరకు గతంలోనే అభ్యర్థించింది. ఇప్పుడు ఎలన్ మస్క్ ఇండియాలో దిగుమతి సుంకం ఎక్కువగా ఉందని ట్వీట్ చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వ కీలక అధికారి ఒకరు కౌంటర్ చేశారు.
''మీ అభ్యర్థతను తప్పకుండా పరిశీలిస్తాం. అయితే.. ఇండియాలో టెస్లా కార్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తారా? ఇది జరిగితేనే.. అది జరుగుతుంది'' అని కౌంటర్ ఇచ్చారు. దీంతో.. ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. జర్మనీ, చైనాలో కార్ల తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసిన టెస్లా.. అక్కడ తయారు చేసిన కార్లను భారత్ లో అమ్మడానికి సిద్ధమవుతోంది. మరి, ఆ కార్లకు ఎందుకు పన్ను తగ్గించాలి? అన్నది ఒక వాదన. అందుకే.. ఇండియాలో ప్లాంటు ఏర్పాటు చేయాలనే డిమాండ్ మొదలైంది. మరి, మస్క్ ఏమంటారో?