498ఏ: సీన్ మారుతోంది

Update: 2016-01-22 09:22 GMT
పరిణయం తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతాయని బ్రహ్మచారులను పెళ్లైన మగాళ్లు ఆట పట్టిస్తుంటారు. హాస్యం మాటెలావున్నా నిజంగానే మ్యారేజ్‌ మగాళ్ల పాలిట ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంద‌ర్భాల్లో కోకొల్ల‌లు. ఆడ‌వాళ్ల అరాచ‌క‌లు త‌ట్టుకోలేక అల్లాడిపోతున్న అమాయ‌కులు ఎంద‌రో! అయితే మొద‌టి నుంచి మ‌హిళ‌లంటే ఉన్న ప్ర‌త్యేక గౌర‌వం, వారికి హింసించిన రాక్ష‌సులు ఉన్న ఉదంతం నేప‌థ్యంలో మ‌గ‌మ‌హారాజుల ఆవేద‌న తెర‌మీద‌కు రాలేదు! వ‌చ్చిన ప్రాచుర్యం ద‌క్క‌లేదు!!

అయితే మహిళపై జరుగుతున్న గృహహింసను నిరోధించేందుకు మాత్రం చ‌ట్టాలు వ‌చ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేకంగా ఐపీసీ సెక్షన్ 498ఎను తెర‌మీద‌కు తెచ్చింది. గృహ‌హింసకు గురవుతున్న మ‌హిళ‌ల‌కు అండ‌గా ఉండేందుకు ఈ సెక్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించింది. అయితే 498ఏ దుర్వినియోగమవుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ సెక్ష‌న్ ఆధారంగా జ‌రిగే అకార‌ణ వేధింపులతో 498ఏ కాస్త‌ మగాళ్ల పట్ల మృత్యుశాసనంగా మారుతోందనే నిర‌స‌న‌లు కూడా జ‌రిగాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది. పురుష స‌మాజం, బాధిత భ‌ర్త‌ల నుంచి వ‌చ్చిన ల‌క్ష‌లాది ఫిర్యాదుల‌తో చట్ట సవరణపై దృష్టిపెట్టింది.  కేంద్ర లా కమిషన్‌ సూచనలు కోరింది. లా క‌మిష‌న్ సిఫార‌సుల ప్ర‌కారం 498ఏ సెక్ష‌న్ కింద‌ కేసు నమోదుకాగానే భర్తను, ఆయ‌న‌ కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేసే విధానాన్ని మార్పు చేయ‌నుంది. ఇందుకోసం న్యాయస్థానం అనుమతితో భార్య‌మ‌ణి, ఆమె భ‌ర్త‌, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌ రాజీపడేందుకు వారికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణ‌యంతో 498ఏ బాధితుల‌కు ఉప‌శ‌మ‌నం ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా... 498ఏ సెక్ష‌న్ దుర్వినియోగం చేస్తుండడంతో వివాహిత పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. భర్త కుటుంబంపై కక్ష సాధించేందుకు ఈ సెక్షన్ ను కొంత మహిళలు దుర్వినియోగం చేస్తుండడం మగాళ్ల బలవన్మరణాలకు కారణమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ ఎదురైన పరిస్థితుల్లో కొందరు భర్తలు ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదని విశ్లేషిస్తున్నారు. ఓ నివేదిక ప్ర‌కారం ఒక్క పశ్చిమబెంగాల్ లోనే భర్తల ఆత్మహత్యలు గత రెండేళ్లలో 10 శాతం పెరిగాయి. బెంగాల్ లో 498ఎ కింద 1.06 లక్షల కేసులు నమోదు కాగా, 80 వేల మంది భర్తలను అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News