ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయమైన మూడు రాజధానులకి అనుకూలంగా ఏపీ గవర్నర్ తన ప్రసంగంలో వివిధ అంశాలను ప్రస్తావించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ మాట్లాడుతూ...మూడు రాజధానుల ఏర్పాటుతో పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు.
పరిపాలనా వికేంద్రీకరణతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. రాజధానుల ఏర్పాటుతో పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతుందన్న హరిచందన్ ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు క్యాబినెట్ లో మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని పేర్కొన్నారు. నవరత్నాల అమలుతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉంటాయని అన్నారు. అలాగే గ్రామ వలంటీర్ల ద్వారా నవశకం సర్వే జరుగుతుందని ఆ నవశకం సర్వే ద్వారా లబ్జిదారుల గుర్తింపు సులభం అవుతుందని అన్నారు.
రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపిన ఏపీ గర్నర్ మన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. బియ్యం - ఆరోగ్య శ్రీ - పెన్షన్లు - విద్యా దీవెన - వసతి దీవెన కార్డులను కొత్తగా అందచేస్తున్నామన్న ఆయన అమ్మఒడి - కాపు నేస్తం - రజకులు - నాయీ బ్రహ్మాణులకు ఆర్ధిక సాయం అందజేత వంటి పధకాల గురించి వివరించారు. రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని - విద్యకు పేదరికం అడ్డు కాకూడదని అమ్మొడి పథకం ప్రారంభించిదని గుర్తుచేశారు. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు - అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.