ఆ ముగ్గురు మధ్య స్నేహం అంతకంతకూ బలపడుతోంది. ముగ్గురు ప్రముఖులు ఒక కార్యక్రమానికి వెళ్లాల్సి వస్తే.. దాదాపుగా ఎవరి ప్రయాణాలు వారే చూసుకోవటం ఇప్పటివరకూ చూసిందే. దీనికి భిన్నంగా.. ముగ్గురు కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేసే ఆసక్తికర పరిణామం తెలుగు నేల మీద కనిపిస్తోంది.
ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి తెలుగు ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్యులు ఒకే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలకు ఆహ్వానం అందింది. మోడీ ప్రమాణస్వీకారోత్సవం రాత్రి ఏడు గంటల వేళలో జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా అదే రోజు ఉదయం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్.. ప్రత్యేక అతిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు హాజరు కానున్నారు. తమ ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యాక ఒకే విమానంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
ఒకవేళ.. కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లాలని డిసైడ్ అయితే.. తమ ప్రత్యేక విమానంలో ఆయన్ను తీసుకెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా.. తెలుగు నేలకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఒకే విమానంలో ఢిల్లీకి ప్రయాణం కావటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.