అనుకుంటాం కానీ పొగడ్త ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో సోమవారం చోటు చేసుకున్న ఘటన చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దీర్ఘకాలంగా ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ సమయం చూసుకొని మాట్లాడటంలో నేర్పరి. తనకు సంబంధించి ఏ విషయాన్ని తాను వదిలిపెట్టనని.. అన్నింటిని గుర్తు పెట్టుకుంటానన్న విషయాన్ని ఆయన చాలా సందర్బాల్లో తెలియజేస్తుంటారు.
తన పట్ల గౌరవంగా ఉండే వారి కంటే.. తన పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని ఉద్దేశించి ఆయన పొగిడేసి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. గతంలో తన పట్ల దురుసుగా వ్యవహరించిన హరీశ్ ను అదే పనిగా గుర్తుంచుకోవటంతో పాటు.. టీఆర్ఎస్ నేతలు వెళ్లిన ప్రతిసారీ హరీశ్ ప్రస్తావన తీసుకొచ్చేవారు.
తాజాగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పై గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్ భవన్ కు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు వెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీపీ బృందంలో రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా గవర్నర్ పలుకరించారు.
అసెంబ్లీలో గవర్నర్ కుర్చీ లాగిన తరవాత ఆయనకు ఎదురుపడటం ఇదే తొలిసారి. నాడు జరిగిన ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నంలో టీటీడీపీ నేతలు ఉండగా.. గవర్నర్ స్పందిస్తూ.. రేవంత్ గురించి నాకు బాగా తెలుసు. అతను చాలా ధైర్యవంతుడు అంటూ పొగిడేశారు. తాను ఆవేశంతో కుర్చీ లాగేస్తే.. గవర్నర్ మాత్రం మెచ్చుకోలుగా మాట్లాడటంతో రేవంత్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో.. రేవంత్ స్పందిస్తూ.. ఆ రోజు కుర్చీ లాగిన ఘటనలో తనతో పాటు హరీశ్ కూడా ఉన్నారని.. గవర్నర్ మాత్రం తనను మాత్రమే గుర్తు పెట్టుకున్నారని.. హరీశ్ ను వదిలేశారంటూ వ్యాఖ్యానించటం జరిగింది. నాడు ఆవేశంతో ఎవరైతే తన పట్ల అమర్యాదగా వ్యవహరించారో వారిని పొగడ్తతో ఉక్కిరిబిక్కిరి చేసేసి వివరణ ఇచ్చేలా చేయటంలో గవర్నర్ నరసింహన్ తర్వాతే ఎవరైనా.