తీవ్ర విషాదం .. నానమ్మ అంత్యక్రియల కోసం పీపీఈ కిట్ లో వచ్చిన మనవడు ..ఎందుకంటే
కరోనా వైరస్ పుణ్యమా అని మొన్నటి వరకు కొద్దో గొప్పో ఉన్న మానవత్వం కూడా మసకబారిపోతుంది. పక్కనే ఎవరైనా ప్రాణాలతో పోరాడుతున్నా కూడా కరోనా భయంతో దైర్యం చేసి సహాయం చేయలేకపోతున్నారు. కరోనా మహమ్మారి వెలుగులోకి రాకముందు ఓ ఊరిలో ఎవరైనా చైపోతే ఆ ఊర్లోని ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి సభ్యుడు చనిపోయాడు అన్నంతగా భాదపడుతూ , దగ్గరుండి దహన సంస్కారాలకి ఏర్పాట్లు చేసేవారు. కానీ , ఇప్పుడు సాధారణంగా మరణించినా కూడా కరోనా భయంతో ఆ ఇంటి వైపు తొంగిచూడటానికి కూడా ఎవరు రావడంలేదు. తాజాగా ఓ వృద్ధురాలు అనారోగ్యం చనిపోవడంతో , కరోనా బారిన పడి , ఐసోలేషన్ లో ఉన్న ఆమె మనవడే పీపీఈ కిట్ వేసుకొని వచ్చి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషాద ఘటన కోదాడ సమీపంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు చూస్తే ... మునగాల గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే కొడుకులందరూ మృతిచెందారు. దీంతో ఆ వృద్ధురాలు ప్రస్తుతం రెండో కుమారుడి కొడుకు దగ్గర ఉంటోంది. అయితే , తాజాగా ఆమె అనారోగ్యం కారణంగా ఆదివారం ఆమె మృతిచెందింది. ఇదే సమయంలో ఆమె మనవడికి కరోనా సోకడంతో చోట హోం ఐసోలేషన్ లో ఉంటున్నాడు. ఆమెకు కూడా కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో ఈ విషయాన్ని గ్రామ పెద్దలు ఐసోలేషన్ లో ఉన్న ఆ వృద్ధురాలి మనవడికి ఫోన్ ద్వారా వివరించారు. దీనితో తన పరిస్థితిని ఆ గ్రామ పెద్దలకు వివరించాడు. దీనితో ఆ గ్రామ పెద్దలే అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తరువాత సాయంత్రం 7 గంటల సమయంలో పీపీఈ కిట్ ధరించి ఆ కరోనా బాధితుడు కార్లో ఇంటికి వచ్చి, తనను ఎంతో అల్లారుముద్దుగా పెంచిన నానమ్మ అలా జీవం లేకుండా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. కానీ దుఃఖాన్ని దిగమింగుకొని ఒక్కడే ఆమె మృతదేహాన్ని కార్లోకి చేర్చాడు. కారును శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి నానమ్మ అంత్యక్రియలు నిర్వహించి మళ్లీ ఐసోలేషన్ కి వెళ్ళిపోయాడు.