గట్టిగా నాలుగు పదుల వయసు చూడకుండానే మంత్రి అయ్యారు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమరనాధ్. పైగా తొలిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి పదవి దక్కడమూ విశేషం. ఇక నాడు చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు దగ్గర మాత్రమే అయిదు కీలకమైన శాఖలు ఉండేవి. ఇపుడు చినబాబు చూసిన ఐటీ సహా పరిశ్రమలు, వాణిజ్యం, టెక్స్ టైల్స్, ఇంఫ్రాస్ట్రక్చర్ శాఖలు గుడివాడకు దక్కాయి. దీంతో ఆయన దశే దశ అని సొంత పార్టీ వారు కూడా అసూయ పడుతున్నారు.
చిన్న వయసులో ఇంత పెద్ద బరువా అని కూడా కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. ఇక మంత్రి అయిన నలభై రోజులకే గుడివాడ విదేశీయానం చేశారు. ప్రతిష్టాత్మకమైన దావోస్ వేదిక మీద మెరిశారు. అటు వైసీపీ సర్కార్ కి ఇటు గుడివాడకూ ఇదే తొలి దావోస్ ట్రిప్ కావడం విశేషం.
ఇక ఇపుడు చూస్తే గుడివాడకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. భద్రతాపరమైన చర్యలలో భాగంగా గుడివాడకు ఈ ప్రత్యేక సదుపాయం కల్పించినట్లుగా చెబుతున్నారు. దాంతో ఉత్తరాంధ్రాలోనే బుల్లెట్ కారున్న మినిస్టర్ గా గుడివాద హిస్టరీ క్రియేట్ చేశారు.
మంత్రిగా గుడివాడ ఉత్తరాంధ్రా అంతటా తిరగాలి, అలాగే పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అదే టైమ్ లో మావోలు కూడా సర్కార్ మీద గురి పెట్టేశారు. ఈ నేపధ్యంలో గుడివాడకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారుని సమకూర్చినట్లుగా చెబుతున్నారు.
మొత్తానికి ఏ మూలకైనా బుల్లెట్ గా దూసుకెళ్ళిపోమని అటు సర్కార్ పెద్దలు దీవించి కారు ఇచ్చారు. యువకుడిగా ఉన్న గుడివాడ తనకు ఇచ్చిన శాఖలలో జోరు చూపించి మంత్రిగా పేరు తెచ్చుకోవాలని అంతా కోరుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆశిస్తున్నారు.