కనీస అవగాహన లేకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పథకాల అమలు కానీ ఉంటే ఎప్పటికప్పుడు వివాదాలు తలెత్తక మానవు. తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖ జెడ్పీ రభసగా మారింది. నిన్నటి వేళ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా జల కళ పథకానికి అమలుకు సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న విషయాలే చర్చకు వచ్చాయి. ఈ పథకం అమలుపై సొంత పార్టీ సభ్యులే మంత్రిని నిలదీశారు. జిల్లాలో వేసిన మొదటి బోరుకు ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వనే లేదని అన్నారు. దీంతో సభలో చాలా సేపు వాగ్వాదం నడిచింది. అదేవిధంగా రైతులందరి సమస్యలూ సభ దృష్టికి వచ్చాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన నేపథ్యంలో జెడ్పీలో ఇద్దరు కలెక్టర్లు ప్రత్యక్షం అయ్యారు. ఒక విశాఖ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాగా, మరొకరు అల్లూరి మన్యం జిల్లా కలెక్టర్. వీరిద్దరూ సమస్యలు విన్నారు. అయితే వీటి పరిష్కారంపై తమకు క్లారిఫికేషన్ వెంటనే ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టడంతో గుడివాడకు చుక్కలు కనిపించాయి.
ఇదే వేదికగా రోడ్ల సమస్య మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. గత ఏడాది నుంచి రోడ్లు టెండర్ దశలోనే ఉన్నాయని సభ్యులు ఆరోపిస్తూ పలు ఆధారాలు చూపించారు. వీటిపై కూడా మంత్రులు ఇచ్చిన క్లారిఫికేషన్ సంతృప్తిగా లేదు. ముఖ్యంగా రైతన్న విషయంలో చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. గ్రూపులకు ట్రాక్టర్లు ఇవ్వవద్దని అవి ఏ మేరకు ఉపయోగపడవు అని ఓ సభ్యుడు సభకు తెలియజేశారు. ముఖ్యంగా వైద్యారోగ్యం పై విపరీతం అయిన విమర్శలు వెల్లువెత్తాయి. నర్సీపట్నం వైద్యారోగ్య కేంద్రంతో పాటు కేజీహెచ్ నిర్వహణపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.