కొందరు నేతల మాటలు చూస్తే కాస్తంత చిత్రంగా అనిపిస్తాయి. తెలంగాణ అధికారపక్షంలో ఫైర్ బ్రాండ్ రూపాన్ని సంతరించుకునేందుకు విపరీతంగా కష్టపడుతున్న ఎమ్మెల్యేల్లో గువ్వల బాలరాజు ఒకరు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇతగాడు.. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ వెనుకాముందు చూసుకోకుండా దాడి చేస్తారన్న పేరుంది.
సాటి ఎమ్మెల్యే అన్నది కూడా చూడకుండా.. చేయి లేపే గుణమున్న గువ్వల తాజాగా మాటలతో మరోసారి చెలరేగిపోయారు. టీఆర్ ఎస్ మీద తన తూటాల్లాంటి మాటలతో మండిపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని కారులోకి ఎక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై డీకే అరుణ మండిపడ్డారు. ఇదంతా మంత్రి జూపల్లి నేతృత్వంలో చోటు చేసుకుందని అరుణ ఫైర్ అవుతున్నారు.
జూపల్లిని వెనుకేసుకొచ్చిన గువ్వల.. డీకే అరుణ రాజకీయ ఎదుగుదల కోసం జూపల్లి ఎంతో సాయం చేశారన్న గువ్వల.. ‘‘జూపల్లి పిల్లి కాదు.. పులి. తెలంగాణ ఉద్యమంలో పులిలా పాల్గొన్నారు. కానీ.. కాంగ్రెస్ నేతలు ఉద్యమసమయంలో పారిపోయారు’’ అంటూ చెలరేగిపోయారు. కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్న బాలరాజు.. తాము పార్టీలోకి చేర్చుకుంటున్న కాంగ్రెస్.. టీడీపీ నేతలంతా ఉద్యమ సమయంలో అంతంతమాత్రమే రియాక్ట్ అయ్యారన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. అయినా.. జూపల్లి లాంటి సీనియర్ నేత పులా? పిల్లా? అన్న సర్టిఫికేట్ గువ్వల ఇవ్వటం ఏమిటో..?