ఒక సెలూన్ షాప్ వల్ల ఏకంగా 91మంది కరోనా అంటింది. కటింగ్ చేయించుకున్న పాపానికి 84మంది ప్రజలు, ఏడుగురు సెలూన్ వర్కర్లకి ఈ వైరస్ సోకింది. ఈ దారుణం మన దేశంలో కాదు.. అమెరికా దేశంలో చోటు చేసుకుంది. ఈ మేరకు యూకే మీడియా సంస్థ సన్ యూకే సంచలన కథనాన్ని ప్రచురించింది.
అమెరికా దేశంలో మహమ్మారి పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల కేసులు.. మరణాలు చోటుచేసుకున్నాయి. సుధీర్ఘ లాక్ డౌన్ తరువాత సెలూన్లకి, బ్యూటీ పార్లర్లకి కస్టమర్ల తాకిడి ఎక్కువైంది. ఎవరికి కరోనా ఉందో కానీ అతడి వల్ల నిర్వాహకులకు.. వారి ద్వారా ఏకంగా 84మందికి కరోనా అంటింది. దీంతో ఈ సెలూన్ల ద్వారా ఇంకా ఎంతమందికి వైరస్ అంటుతుందనే భయం నెలకొంది.
అమెరికాలోని మిస్సోరీలో సెలూన్ లో కటింగ్ చేయించుకున్న 91మంది కరోనా వ్యాపించింది. మిస్సోరీలోని గ్రేట్ క్లిప్స్ అనే సెలూన్ లో కటింగ్ చేయించుకునేందుకు వినియోగదారులు వెళ్లారు. మే 12 నుంచి మే 21 వరకు సెలూన్ లో కస్టమర్ల రద్దీ పెరిగింది. ఎవరి ద్వారానో సెలూన్ లో పనిచేస్తున్న వర్కర్ కి కరోనా సోకింది. అయితే లక్షణాలు బయటపడ్డా చికిత్స తీసుకోకుండా కటింగ్ చేశాడు. దీంతో ఆ సెలూన్ కు వెళ్లిన కస్టమర్లకు కూడా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
దీంతో అప్రమత్తమైన అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు గ్రేట్ క్లిప్స్ సెలూన్ లో కటింగ్ చేయించుకున్న కస్టమర్లకు, అందులో పనిచేస్తున్న వర్కర్లకు టెస్టులు చేయగా.. మొత్తం 91మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో వీరందరినీ ఐసోలేషన్ కు తరలించారు. ఒక సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకున్న పాపానికి ఇంత మందికి వైరస్ సోకడం చర్చనీయాంశమైంది.