బాలీవుడ్ ను ఒక్కో సీజన్ లో ఒక్కో కాన్సెప్ట్ రాజ్యమేలుతుంది. కొద్దికాలంగా క్రీడాకారుల జీవితాలు సినిమాలుగా వచ్చాయి. తాజాగా రాజకీయ నాయకుల జీవితగాధలపై బాలీవుడ్ దర్శకులు కన్నేస్తున్నారు. ఇందుకు ఇందిరాగాంధీ కుటుంబాన్ని ఎంచుకుంటున్నారు. మనీష్ గుప్తా ఇప్పుడు ఇందిర గాంధీ చరిత్రను తెరకెక్కిస్తుండగా మరో దర్శకుడు హన్సల్ మెహతా సంజయ్ గాంధీ జీవితాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
సంజయ్ గాంధి జీవితం, మరణం గురించి భిన్న కథనాలున్నాయి. సంజయ్ గాంధి గురించి పరిశోధించి వినోద్ మెహత అనే రచయిత ''ది సంజయ్ స్టొరీ' పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగానే దర్శకుడు హన్సల్ మెహతా ఈ సినిమా రూపొందించనున్నట్టు సమాచారం. అయితే... సంజయ్ జీవితంలో మెరుపులు కంటే మరకలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని ప్రజలెలా రిసీవ్ చేసుకుంటారన్నది ఒక ప్రశ్న కాగా సంజయ్ గాంధీ కుటుంబ రాజకీయ నేపథ్యం.. ప్రస్తుతం పార్టీలతో అనుబంధం నేపథ్యంలో దీనిపై ఎలాంటి స్పందన వస్తుందన్నదీ చూడాలి. ఇంతకీ ఆ సినిమాలో సంజయ్ గాంధీ విలనో.. హీరోయో తెలియాల్సి ఉంది..