లోక్‌ స‌భ‌కు హ‌ర్దిక్‌... ఎక్క‌డి నుంచంటే

Update: 2019-02-06 15:57 GMT
హార్దిక్ ప‌టేల్‌...ప‌టేదార్ ఉద్య‌మ‌నేతగా సుప‌రిచితుడు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజరాత్‌ లో త‌న పోరాటంతో దేశం చూపును త‌న వైపు తిప్పుకున్న నాయ‌కుడు. త్వ‌ర‌లో ఆయ‌న ఉద్య‌మ‌నేత నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా మార‌నున్నారు. ఔను. హార్దిక్‌ లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. ల‌క్నోలో జ‌రిగిన ర్యాలీలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే, ఎక్క‌డి నుంచి బ‌రిలో దిగుతానో ఆయ‌న ప్ర‌క‌టించ‌లేదు.

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో చిన్న వ‌య‌సు కార‌ణంగా ఆ ఎన్నిక‌ల‌కు దూరంగా నిలిచాడు. అయితే ఏ స్థానం నుంచి అత‌ను పోటీ చేస్తాడ‌న్న విష‌యాన్ని ఇంకా వెల్ల‌డించ‌లేదు. గుజ‌రాత్‌ లోని అమ్రేలీ లేదా మెహ‌సానా స్థానం నుంచి పోటీ చేస్తాడ‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెహ‌సానాలో ప్ర‌వేశించ‌రాదు అన్న నిషేధం ఉంది కాబ‌ట్టి, అత‌ను అమ్రేలీ నుంచి పోటీ చేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. 2017లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అమ్రేలీ లోక్‌ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న అయిదు స్థానాల్లో ప‌టేదార్లు గెలిచారు. దీంతో హార్థిక్ ఆ స్థానం నుంచే పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

గ‌త ఏడాది రైతులు, ప‌టీదార్ల కోసం హార్దిక్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. 19 రోజుల త‌ర్వాత ఆయ‌న దీక్ష‌ను విడిచారు. పాటిదార్‌ వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఆయ‌న ఆందోళ‌న నిర్వ‌హించారు. రైతుల రుణాలు కూడా మాఫీ చేయాల‌ని ఆయ‌న కోరారు. పాటిదార్లకు విద్యా ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతూ గుజరాత్‌ లోని పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ నిరవధిక నిరాహార దీక్ష చేప‌ట్టారు. హార్దిక్ పటేల్ ఆరోగ్యం రోజురోజుకు దిగజారడం, ప‌టేల్ సామాజిక‌వ‌ర్గం నేత‌లు స‌ర్దిచెప్ప‌డంతో ఆయ‌న దీక్ష వ‌దిలారు. ఇటీవ‌లే హార్దిక్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News