ఓ 30 ఏళ్ల కిందటి మాట ఇదీ.. అప్పుడు టీవీ ఉండేది కాదు.. సెల్ ఫోన్ ఉండేది కాదు.. కరెంట్ కూడా అన్ని గ్రామాలకు ఇలా 24 గంటలు ఉండేది కాదు.. అందుకే విద్యార్థులంతా బుద్దిగా చదువుకునే వారు.. వీధి దీపాల కింద కూడా చదువుకొని పైకి వచ్చిన వారున్నారు. చదువుకు ప్రధాన అడ్డంకిగా మారిన టీవీ, సెల్ ఫోన్ లేకపోవడంతో అంతా పత్రికలు, చదువుల మీదే ఆధారపడి చాలా మంది బాగుపడ్డారు..
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువతకు సెల్ ఫోన్ వ్యసనంగా మారింది. చాలా మంది దానికి బానిస అయిపోతున్నారు. సోషల్ మీడియా లేకుంటే బతకలేకపోతున్నారు. చదువు సంధ్యలు, క్రీడలు లేకుండా గంటల తరబడి ఫోన్లు పట్టుకొని ‘టిక్ టాక్- వాట్సాప్- ఫేస్ బుక్ - ట్విట్టర్ లో టైం వృథా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చదువులు చట్టబండలవుతున్నాయి.
తాజాగా మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు అదే విషయం నొక్కివక్కాణించారు. సిద్దిపేట జిల్లా పది, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో ఎక్కడో ఉండేది. కానీ ఇటీవల హరీష్ తీసుకున్న శ్రద్ధ.. ఫోన్లకు దూరంగా ఉండాలని పదోతరగతి విద్యార్థులకు సూచించడం.. వారికి స్పెషల్ క్లాస్ లు, టిఫిన్లు అందించే కార్యక్రమాలు చేపట్టారు. దీంతో సిద్ధిపేట జిల్లా విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారు. ఏకంగా మొన్నటి పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచారు.
ఈ నేపథ్యంలో తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్టేడియంలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్ మీట్స్ ను ప్రారంభించిన హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పుడు విద్యార్థులకు ప్రధాన శత్రువు సెల్ ఫోన్ అని.. సోషల్ మీడియా మాయలో పడి టైం వేస్త్ చేస్తూ చదువులను పక్కనపడేస్తున్నారని.. విద్యార్థులు సోషల్ మీడియాలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితబోధ చేశారు. మనిషి ఏకాగ్రత పెంచడంలో క్రీడలు ఫిజికల్ ఫిట్ నెస్ దోహదపడుతుందని.. కానీ సెల్ ఫోన్ తో ఆడుతూ విద్యార్థులు దాన్ని పెడచెవిన పెడుతున్నారని వాపోయాడు. సెల్ ఫోన్ పారేసి చదువు, క్రీడలు, వ్యక్తిగత ఇష్టాలపై దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉన్న పదోతరగతి విద్యార్థులు బాగా చదవి పోయిన ఏడాది రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాను రెండో స్థానంలో నిలిపారని.. విద్యార్తులంతా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటే ఎంత అద్భుతాలు జరుగుతాయో ఇదే నిదర్శనం అంటూ హితబోధ చేశారు.