హ‌రీశ్ సైతం కాద‌న‌కుండా చేసిన కేటీఆర్

Update: 2018-08-19 10:02 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ లో ఉన్న చ‌మ‌త్కారం అంతా ఇంతా కాదు. రాజ‌కీయ వార‌సులు స‌హ‌జంగా ఎదుర‌య్యే వ్య‌తిరేక‌త‌ను త‌న స‌మ‌ర్థ‌త‌తో అంద‌రి మ‌న‌సుల్ని దోచుకోవ‌టంలో ఆయ‌న మొద‌ట‌గా ఉంటారు. మారిన కాలంలో రాజ‌కీయ వార‌సులు అన్న వెంట‌నే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంటుంది.

అందుకు భిన్నంగా త‌న తండ్రి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టికీ.. త‌న మార్క్ ను కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించేలా చేస్తున్న కేటీఆర్ టాలెంట్ ను ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. మిగిలిన మంత్రులు ఎవ‌రూ త‌న ద‌గ్గ‌ర‌కు రాని రీతిలో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఉంటుంద‌ని చెప్పాలి.

ప‌ని తీరులో కేటీఆర్ కంటే మిన్న‌గా ప‌ని చేసే మంత్రులు ఉన్నారు. అలాంటి వారిలో మంత్రి హరీశ్ నిలుస్తారు. అయితే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌టం.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌టం..అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద స‌త్తాను ప్ర‌ద‌ర్శించ‌టం.. లాంటి విష‌యాల్లో కేటీఆర్ ముందు హ‌రీశ్ తేలిపోతుంటారు.

అంతేనా.. కొన్ని సంద‌ర్భాల్లో ప్రోయాక్టివ్ గా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌న‌లోకి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు కేటీఆర్. తాజాగా అలాంటి ప‌నే చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. కేర‌ళ‌ను ముంచెత్తిన వ‌ర్షాల నేప‌థ్యంలో.. దారుణంగా దెబ్బ తిన్న ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు త‌న‌తో పాటు.. అంద‌రు మంత్రులు త‌మ నెల‌స‌రి జీతాన్ని కేర‌ళ‌కు విరాళంగా ఇవ్వాల‌న్న పిలుపునిచ్చారు.

ఒక మంచి ప‌ని కోసం కేటీఆర్ ఇచ్చిన పిలుపున‌కు.. మ‌న‌సులో ఎలాంటి భావ‌న ఉన్నా.. ఓకే అనాల్సిందే. కేటీఆర్ తో పెద్ద‌గా పొస‌గ‌ద‌ని త‌ర‌చూ వార్త‌లు వ‌చ్చే హ‌రీశ్ సైతం..తాజా పిలుపు విష‌యంలో రియాక్ట్ అయ్యార‌ని చెప్పాలి. కేర‌ళ‌ను ఆదుకోవ‌టానికి త‌న వంతు సాయంగా.. నెల‌స‌రి జీతాన్ని కేర‌ళ‌కు ఇస్తున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌న మాట‌ను అంద‌రూ ఫాలో అయ్యేలా చేయ‌టంలో త‌న‌కున్న స‌మ‌ర్థ‌త‌ను కేర‌ళ ఎపిసోడ్ ద్వారా కేటీఆర్ మ‌రోసారి త‌న స‌త్తా చాటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News