హర్షల్​ లేకపోతే.. ఆర్​సీబీ ఓడేది..!

Update: 2021-04-10 06:43 GMT
ముంబై ఇండియన్స్​ అంటేనే ఎంతో పటిష్ఠమైన జట్టు.. ఆ జట్టు బరిలోకి దిగిందంటే ప్రత్యర్థులకు చుక్కలే. ఎందుకంటే అక్కడ అందరూ అద్భుతమైన బ్యాట్స్​మెన్లు. బంతులను సిక్సర్లుగా, ఫోర్లుగా మార్చగలిగిన సత్తా ఉన్నవాళ్లే. అందుకే ముంబై ఇండియన్స్​ క్రీజ్​ లోకి వచ్చిందంటే.. ఓపెనర్లు రాణించలేకపోయినా.. మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్లు దుమ్ము లేపుతారు. ఒకవేళ మిడిల్​ ఆర్డర్​ కుప్పకూలినా ఆఖరున వచ్చే ఆల్​రౌండర్లు సైతం పరుగుల వరద పారిస్తుంటారు.

 నిజానికి ఐపీఎల్​ అంటే ఓ పండగ లాంటిది. పరుగుల వరద పారించడం.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా మ్యాచ్​లు సాగడం మనం చూస్తుంటాం. ఇదిలా ఉంటే నిన్న ఐపీఎల్​ తొలిమ్యాచ్​ జరిగిన విషయం తెలిసిందే. మొట్ట మొదటి మ్యాచ్​ లోనే దిగ్గజ టీమ్​ లో ఆర్​సీబీ, ముంబై ఇండియన్స్​ తలపడ్డాయి. ఎంతో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్​ గెలుపు చాలా ఈజీ అని అంతా భావించారు. క్రికెట్​ అభిమానులు సైతం ఇదే లెక్కలు వేసుకున్నారు. సోషల్​మీడియాలోనూ ముంబై ఇండియన్స్​ గెలుపు పక్కా అని మ్యాచ్​ ప్రారంభం కాకముందే పోస్టులు వెలిశాయి.

ఇదిలా ఉంటే అసలు సీన్​ మాత్రం మరోలా జరిగింది. ముంబై ఇండియన్స్​ ఓడిపోయింది. ఎంతో పటిష్ఠమైన జట్టు అయినప్పటికీ ఆశించిన మేరకు రాణించలేకపోయింది. అయితే ఆర్​సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించింది మాత్రం హర్షల్​ పటేల్​. ఈ బౌలర్​ ఓవర్​ నైట్​ లోనే స్టార్​ గా మారిపోయాడు. ఏకంగా నాలుగు కీలక వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సీజన్​ లో ఐపీఎల్​ స్టార్​గా నిలిచాడు.

హర్షల్​ తన బౌలింగ్​ మాయాజాలంతో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా వంటి  బ్యాట్స్​మెన్లను పెవిలియన్​ దారి పట్టించాడు. దీంతో ముంబై ఇండియన్స్​ భారీ స్కోర్​ చేయలేకపోయింది. ఈ లక్ష్యాన్ని ఆర్​సీబీ తేలిగ్గా ఛేదించగలిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్ తొలి మ్యాచ్ లో హర్షల్​ హీరోగా మారిపోయాడు.  2012 నుంచి హర్షల్ ఐపీఎల్​ లో ఆడుతున్నాడు. కానీ పెద్దగా రాణించలేకపోయాడు. కానీ ఈ సీజన్​ తొలి మ్యాచ్​ లోనే తన సత్తా చాటాడు. ఏకంగా అయిదు వికెట్లను సొంతం తీసి రికార్డు నెలకొల్పాడు. నాలుగు ఓవర్ల వేసి 27 పరుగులు మాత్రం ఇచ్చాడు. అంతేకాక కీలక బ్యాట్స్​మెన్లను పెవిలియన్​ దారి పండించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చిట్టచివరి బంతికి విజయాన్ని సాధించింది.

ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లను కోల్పోయి అందుకుంది.2012 నుంచీ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడుతున్నప్పటికీ.. పెద్దగా రాణించలేదు. 2016 నుంచి ఇప్పటిదాకా అతను ఆడింది 18 మ్యాచ్‌లే. ఆశించిన గుర్తింపు కూడా అతనికి దక్కలేదు. నిన్నటి మ్యాచ్‌ ద్వారా  హీరో అయ్యాడు.
Tags:    

Similar News