జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళ ఏమాత్రం ప్రశాంతంగా లేరట. వరుసగా చోటు చేసుకుంటున్నపరిణామాలపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తాజాగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నమ్మి పార్టీని చేతిలో పెట్టిన పార్టీ ఉప కార్యదర్శి దినకరన్ తీరుపై ఆమె అగ్గి ఫైర్ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
అమ్మ వెంట దశాబ్దాల తరబడి నడిచి.. నమ్మకంగా నిలిచినందుకు ప్రతిగా చేతికి వచ్చిన పార్టీ పగ్గాల్ని చేజిక్కించుకున్నచిన్నమ్మ ఆనందం ఆవిరయ్యేలా పన్నీరు సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేయటం.. ఆయన్ను కంట్రోల్ చేసేందుకు చిన్నమ్మ కసరత్తు పూర్తి కాక ముందే.. ఆమెకు జైలుకు వెళ్లాల్సిరావటం తెలిసిందే. అయినప్పటికీ..చేతికిచిక్కిన పార్టీ పగ్గాల్ని జాగ్రత్తగా ఒడిసిపట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో సక్సెస్ అయిన చిన్నమ్మకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నట్లుగా చెబుతున్నారు.
తాను జైలుకు వెళ్లాల్సిన వేళ.. పార్టీని జాగ్రత్తగా చూసుకుంటారన్న నమ్మకంతో తన అక్క కుమారుడు టీటీవీ దినకర్ చేతిలో పార్టీని పెట్టటమే కాదు.. తనకు సమానమైన హోదా అయిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి అన్న పదవిని సృష్టించి.. అందులో ఆయన్ను కూర్చోబెట్టిన వైనం తెలిసిందే. అయితే.. అమ్మ మృతితో జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ..గుర్తు మీద పోటీ చేసేలా ఎన్నికల సంఘాన్ని కన్వీన్స్ చేసే ప్రయత్నంలో దినకరన్ ఫెయిల్ కావటంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
జైలుకు వెళ్లిన తర్వాత కూడా.. ఎడపాటిని ముఖ్యమంత్రిని చేసే విషయంలో చిన్నమ్మ ప్లాన్ తూచా తప్పకుండా వర్క్ వుట్ అయ్యేలా ప్లాన్ సిద్ధం చేసినప్పటికీ.. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు చేజారటం.. మరో పార్టీని ఏర్పాటు చేయాల్సి వచ్చి.. ఆపార్టీ తరఫున పోటీ చేయటంపై ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో పాటు.. ఈ వ్యవహారంలో దినకరన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా ఆమె భావిస్తోన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ.. పార్టీ గుర్తు తమదేనన్న విషయాన్న స్పష్టం చేస్తూ.. ఈసీ దగ్గర బలంగా వాదించటంలో ఫెయిల్ అయినట్లుగా ఆమె అభిప్రాయపడుతున్నట్లుగా చెబుతున్నారు.
పార్టీ రెండాకులు చేజారి.. టోపీ గుర్తును ఎంచుకోవటంపై అగ్గి మీద గుగ్గిలం మాదిరి మారారని చెబుతున్నారు. జైలు నుంచి ఫోన్ మాట్లాడిన చిన్నమ్మ.. దినకరన్ కు గట్టిగా తలంటు పోసినట్లు తెలుస్తోంది. వైరివర్గానికి చెందిన పన్నీర్ సెల్వం రెండు విద్యుత్ స్తంభాల్ని ఎంచుకోవటం ద్వారా తెలివిని ప్రదర్శించారన్నవ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసుకున్న టోపీ గుర్తు ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ పెంచటం ఖాయమని.. అసలు..టోపీ గుర్తును ఎలా ఎంపిక చేసుకున్నారని దినకరన్ అండ్ కోను తిట్టిపోసినట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/