నోట్ల రద్దుపై సుప్రీంలో విచారణ.. ఆరేళ్లకు మోడీ సర్కార్ కు షాక్ లగా!

Update: 2022-09-27 03:34 GMT
ఊహించని పిడుగులా దేశ ప్రజలపై పడిపోయాడు నరేంద్రమోడీ. 2016లో నోట్లు రద్దు చేసి ప్రజల వద్దనున్న డబ్బునంతా చిత్తు కాగితాలుగా మార్చేశాడు. ఊహించని ఈ ఉపద్రవానికి ప్రజలంతా నానా హైరానా పడ్డారు. పాతనోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించడంతో చిన్నా పెద్దా అంతా బ్యాంకుల ముందు క్యూ కట్టారు. ఇక బ్లాక్ మెయిలర్స్, నల్ల డబ్బు ఉన్నవారు, ఫేక్ కరెన్సీ ఉన్న వారికి ఈ చర్య భారీగా దెబ్బ తీసింది.

ఈ పెద్ద నోట్ల రద్దుపై ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా మోడీ సర్కార్ పట్టించుకోలేదు. జనాలంతా బ్యాంకుల ముందు క్యూ కట్టి నానా అగచాట్లు పడ్డా కూడా ఎందుకో మళ్లీ మోడీనే గెలిపించేశారు.  2016లో మోడీ సర్కార్ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన తర్వాత ఇన్నేళ్లకు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత దీనిపై సుప్రీంకోర్టు విచారించనుంది.

ఈ నోట్ల రద్దు రాజ్యాంగబద్దతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఆ పిటీషన్లపై సుప్రీం కోర్టు ఇప్పుడు విచారణకు సిద్ధమైంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం విచారించనుంది.

నోట్ల రద్దును నాడు ప్రజలు, పార్టీలు వ్యతిరేకించినా మోడీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. నవంబర్ 8, 2016న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత నాడు చాలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను నిషేధించారు. ఎలాంటి లావాదేవీలకు ఉపయోగించలేమని ప్రకటించారు. నల్లధన నిర్మూలన అంటూ మోడీ సర్కార్ ఇలా సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను కృంగదీసింది. పదేళ్లు వెనక్కి తీసుకెళ్లింది.

దీనిపై నాడు ఎంత మంది ఎన్ని రకాలుగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కానీ నేడు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ అంశంపై  కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుటుంది? ఎలాంటి షాకులు ఇస్తుందన్నది వేచిచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News