ఒకరిని ఒకరు ఉద్దేశించి వ్యాఖ్యలు చేసుకోవటం.. విమర్శలతో విరుచుకుపడటం.. ఆరోపణలతో వాడివేడి వాతావరణాన్ని క్రియేట్ చేయటంలో రాజకీయ రంగం తర్వాతే ఏదైనా. ఇటీవల కాలంలో దూకుడు రాజకీయాలు పెరిగిపోయి.. తమ ప్రత్యర్థులను.. రాజకీయంగా తాము అనుకున్న దానికి భిన్నంగా వ్యవహరించే వారిని సైతం కాస్తంత ఘాటుగా రియాక్టు కావటం కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి 'మరమనిషి'గా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్న వైనం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారటంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. అంతేకాదు.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతలు సైతం ఈటలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. స్పీకరర్ కు ఆయన తక్షణమే సారీ చెప్పాలని పేర్కొన్నారు. అయితే.. ఈటల మాత్రం వీటికి అస్సలు స్పందించలేదు. ఇదిలా ఉండగా.. స్పీకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ సారీ చెప్పకపోవటంతో ఈటలపై టీ స్పీకర్ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు.
అసలేం జరిగిందంటే.. స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారని.. సభా సంప్రదయాల్ని మర్చిపోతున్నట్లుగా ఈటల ఘాటు విమర్శలు చేశారు. ఐదు నిమిషాలు అసెంబ్లీ సమావేశాన్ని ముగించి.. ప్రజా సమస్యలనుంచి తప్పించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 80-90 రోజుల్లో అసెంబ్లీ నడిచిందని.. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలోనూ వర్షాకాల సమావేశాలు 20 రోజులపాటు సాగేవన్నారు.
అలాంటిది ఇప్పుడు మాత్రం కేవలం ఐదు నిమిషాల్లోనే సభను పూర్తి చేయటం ఏమిటని ప్రశ్నించారు. మూడు రోజుల పాటు నిర్వహించటం ఏమిటి? అని నిలదీశారు. ఈ సందర్భంగా అన్న మాటను పట్టుకున్న కేసీఆర్ .. స్పీకర్ ను అంతలా అవమానిస్తారా? అంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. తనపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈటల క్షమాపణలు చెప్పక పోవటంతో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సెషన్ మొత్తానికి అసెంబ్లీ నుంచి ఈటలను సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? బెదిరిస్తారా? అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు స్పందనగా.. సభ నుంచి బయటకు వెళ్లాలంటూ సూచన చేశారు. సభ గౌరవాన్నికాపాడేందుకు ఈటలపై చర్యలుగా మంత్రి ప్రశాంత్ అభివర్ణిస్తే.. ఈటల తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
అయితే.. ఈటల అందుకు సానుకూలంగా స్పందించని కారణంగా తాజాగా ఆయన్నుఈ సెషన్ ముగిసే వరకు సభకు ఆయన్ను అనుమతించమని స్పష్టం చేశారు. స్పీకర్ పై ఈటల అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సైతం కోరారు. ఈటల మాత్రం అందుకు ససేమిరా అనటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.