ఆన్‌ లైన్ క్లాసుల పై సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న!

Update: 2020-07-01 15:00 GMT
ఆన్‌లైన్ క్లాస్‌లు ఉంటాయా ? ఉండవా ? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం ఏంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్ అసోసియేషన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. జీవో 46ని ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఆన్ లైన్ క్లాసెస్ వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా అడ్డగోలు ఫీజులు చెల్లించాలని ప్రయివేటు స్కూల్స్ ఒత్తిడి తెస్తున్నాయని వివరించింది. వసూళ్ల కోసం స్కూల్స్ పంపించిన సందేశాలను వాయిస్ ‌లను సాక్ష్యాలను కోర్టుకు అందించింది. ఈ నేపథ్యంలో ఆన్ ‌లైన్ క్లాస్‌ల నిర్వహణపై ప్రభుత్వం ఏమైనా సర్క్యులర్ జారీ చేసిందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై పరిశీలిస్తున్నారని తెలిపారు. అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్‌ లైన్‌ క్లాసులపై ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారో కోర్టుకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. ఆన్లైన్‌ క్లాస్‌ లు ఉంటాయా.. ఉండవా అన్న ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.
Tags:    

Similar News