చిక్కుల్లో పడ్డ ఏపీ డిప్యూటీ సీఎం.!

Update: 2019-11-21 04:25 GMT
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చిక్కుల్లో పడ్డారు. చెల్లుబాటు కాని కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆమె ఎన్నిక రద్దు చేయాలని కొందరు హైకోర్టుకెక్కారు. దీంతో హైకోర్టు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంకు నోటీసులు జారీ చేశారు.

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాం ఎస్టీ నియోజకవర్గం నుంచి ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి  గెలిచారు. ఏకంగా ఎస్టీ కోటా డిప్యూటీ సీఎం అయ్యారు.

పుష్ఫ శ్రీవాణి ఎస్టీ కాదంటూ ఆమె ప్రత్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. సింహాచలం, బీజేపీ అభ్యర్థి ఎన్.జయరాజు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు.  పుష్ప శ్రీవాణి ‘కొండదొర’గా పేర్కొంటూ ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందారని.. కానీ అది చెల్లుబాటు కాదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.

దీనిపై విచారించిన హైకోర్టు పుష్ఫ శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. ఆమె వివరణ చూశాక దీనిపై విచారణ జరపనుంది.
Tags:    

Similar News