కాంగ్రెస్ ఎంపీ , తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి ఎట్టకేలకు నేడు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు బుధవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి రేవంత్ రెడ్డి కి షరతుల తో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.10 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని కూడా ఆదేశించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో.. రేవంత్‌రెడ్డి ఈ సాయంత్రం విడుదల కానున్నారు. గత 14 రోజులుగా రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులోనే ఉన్నారు. తొలుత బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను కూకట్‌పల్లి కోర్టు కొట్టివేసింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు, దీనితో నేడు హైకోర్టు రేవంత్ కి బెయిల్ మంజూరు చేసింది.
రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ పైన అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసి, గెస్ట్ హౌస్ ని చిత్రీకరించిన ఆరోపణలపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు, ఆయనను మియాపూర్ కోర్టులో హాజరుపరచటంతో కోర్ట్ రేవంత్ రెడ్డికి రిమాండ్ విధించింది. అయితే , ఆ ఫాంహౌజ్ ని మంత్రి కేటీఆర్ జీవో నెం. 111ను ఉల్లంఘించి నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని నిరూపించేందుకు తాను డ్రోన్ ఎగరేసినట్లు చెప్పారు. అయితే, రేవంత్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గోపన్ పల్లి వ్యవహారంలో రేవంత్ రెడ్డిని అడ్డంగా దొరికిపోవడం తో ఆయన జీవో 111 అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శిస్తున్నారు. కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టిఆర్ ఎస్ నేతలు చెప్తున్నారు.
ఈ కేసు సంగతి ఇలా ఉంటె ..మరోవైపు మరోవైపు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న మంగళవారం ఏసీపీ ప్రత్యేక కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. ఎంపీ రేవంత్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన తరఫు న్యాయవాదులు రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నందున విచారణకు హాజరు కాలేరని కోర్టుకు తెలిపారు. దీనితో ఈ కేసు విచారణని కోర్ట్ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.