ఎస్ఈసీ నీలం సాహ్ని నియామకంపై హైకోర్టు విచారణ

Update: 2021-06-21 12:43 GMT
ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నీ నియామకంపై మరోసారి వివాదం చెలరేగింది. ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ శైలిజ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.పిటీషనర్ డాక్టర్ శైలజ తరుఫున న్యాయవాది ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోకుండానే నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలు చేపట్టారని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ కు నెలరోజుల సమయం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా , ఎస్ఈసీగా వ్యవహరించిన నీలం సాహ్ని అదేమీ పట్టించుకోకుండా ఎన్నికలు జరపారని ఆరోపించారు. తద్వారా రూ.160 కోట్ల మేర ప్రజల డబ్బు వృథా అయ్యిందని తెలిపారు. ఈ డబ్బు ఎవరు తిరిగి చెల్లిస్తారని న్యాయవాది ప్రసాద్ బాబు ప్రశ్నించారు.వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Tags:    

Similar News