సిబ్బంది చర్యలతో గౌరవం లేని మరణం

Update: 2020-07-06 17:30 GMT
శ్రీకాకుళం జిల్లాలో జేసీబీలోను, మున్సిపల్ గార్బేజ్ ట్రాక్టరులోను మృతదేహాన్ని తరలించడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి వెంటనే దానిపై స్పందించి... అంత్యక్రియల్లో మృతదేహాలకు గౌరవం ఇవ్వకుండా నిర్వహించిన అధికారులను సస్పెండ్ చేశారు. తాజాగా తిరుపతిలోను అదే జరిగింది.

తిరుపతి శివారు ప్రాంతానికి చెందిన ఒకరికి కరోనా సోకడంతో రుయాలో చికిత్స కోసం చేరారు. పరిస్థితి విషమించి మరణించారు. నిబంధనల ప్రకారం అంత్య క్రియలు నిర్వహించాల్సి వైద్య సిబ్బంది అగౌరవంగా ప్రవర్తించారు. అంబులెన్సులో పెట్టేటపుడు సాధారణంగా వ్యవహరించిన సిబ్బంది.. శ్మశాన వాటికలో అంబులెన్సు నుంచి దించిన వెంటనే జేసీబీ లో మృతదేహాన్ని ఉంచారు. దాని సాయంతోనే మృతదేహాన్ని గుంతలో వేసేశారు.

ఈ వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యింది. ఇంత అవమానకరంగా అంత్యక్రియలా అంటూ అంతటా విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం పదేపదే చెబుతోంది. మృతదేహంలో ఆరు గంటలకు మించి కరోనా ఉండదు అని చెప్పినా వినిపించుకోవడం లేదు. మరణాన్ని అవమానిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇటీవలే ఇలా చేసిన వారిని సస్పెండ్ చేసినా వైద్య సిబ్బంది ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్తితి.
Tags:    

Similar News