ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగానే సమయం ఉన్నప్పటికీ రాజకీయాలు హీటెక్కాయి. వివిధ పార్టీల నేతల భేటీలు, కాపు నేతల వరుస సమావేశాలతో ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు మారాయి.
విజయవాడలో మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు నివాసంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమావేశం కావడం ఆసక్తికర పరిణామాలకు దారి తీసింది. ఈ సమావేశానికి ముందు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు.
తాము మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహానికి హాజరయ్యామని.. ఇందులో భాగంగా అన్ని పార్టీలకు చెందిన నేతలు కనిపించడంతో వారితో మాట్లాడానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ భేటీ సాధారణంగా జరిగిందే తప్ప ఇందులో ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.
ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే ఆ విషయాన్ని మీడియాకు చెబుతానని తేల్చిచెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.