మాటా మాటా తేడా రావటం సహజం. అందులో న్యాయం.. అన్యాయం గురించి పక్కన పెడదాం. ఎంత కండ బలం ఉంటే మాత్రం ఇష్టారాజ్యంగా కొట్టేసి.. దారుణంగా గాయపర్చటం ఎంతవరకు సబబు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
హైదరాబాద్ మహానగరంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మీద హోటల్ సిబ్బంది చేసిన దాడి ఉదంతం సంచలనంగా మారింది. ఒక్కడ్ని చేసి 20 మంది హోటల్ సిబ్బంది కర్రలతో.. రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ కు ఆన్ లైన్ ఆర్డర్ కోసం స్విగ్గీ డెలివరీ బాయ్ వెళ్లాడు. తనకు ఇవ్వాల్సిన పార్సిల్ కోసం డెలివరీ బాయ్ దాదాపు అరగంట పాటు హోటల్ వద్ద వెయిట్ చేశాడు. ఆర్డర్ ఆలస్యం అవుతున్నందున.. హోటల్ యజమానిని తనకు ఇవ్వాల్సిన డెలివరీని త్వరగా ఇవ్వాలని కోరాడు.
దీనిపై హోటల్ యజమాని తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. అక్కడితో ఆగకుండా డెలివరీ బాయ్ మీద హోటల్ సిబ్బంది 20 మంది రాడ్లతో దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. డెలివరీ బాయ్ మీద దాడి జరిగిన వైనం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
గాయపడిన డెలివరీ బాయ్ ను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన హోటల్ యాజమాన్యం తీరుకు నిరసనగా డెలివరీ బాయిస్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు హోటల్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.