సున్నితమైన మనస్తత్వం - చిన్నారుల అల్లరిని సైతం అర్థం చేసుకోలేని ఇంటి యజమాని మూర్ఖత్వంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన హృదయవిదారక ఘటన హైదరాబాద్ లో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సుజాత- రామకృష్ణ దంపతులు కూకట్ పల్లిలోని శ్రీనివాసనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు. నాలుగేళ్ల వయసు ఒకరిది కాగా రెండేళ్ల చిన్నారి ఇంకొకరు. ఈ చిన్నారుల అల్లరి కారణంగా తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని యజమాని పదేపదే వేధింపులకు సుజాత దంపతులతో వాగ్వాదానికి దిగేవాడు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం నాడు సుజాత భర్త రామకృష్ణ బయటకు వెళ్లిన సమయంలో ఇంటి యజమాని సుజాత ఉంటున్న గదికి వెళ్లి పిల్లల అల్లరి విషయంలో గొడవకు దిగాడు.
ఇంటి యజమాని ప్రసన్న కుమార్ ఇబ్బందికరమైన ప్రవర్తనతో సున్నిత మనస్కురాలైన సుజాత తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి గల కారణం ఇంటి యజమాని అని ఇంటి గోడపై రాసింది. తన భర్త లేని సమయంలో యజమాని తమ ఇంటికి వచ్చి దుర్బాషలాడరాని, ఆయన ప్రవర్తనతో తీవ్ర కలత చెంది తాను ఉరి వేసుకుంటున్నానని ఇంటిలోని గోడపై రాసి మరణించింది. కొద్ది సమయం తర్వాత వచ్చిన భర్త రామకృష్ణ ఈ ఘటన చూసి షాక్ కు లోనయ్యారు. జరిగిన విషయాన్ని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న ఇంటి యజమాని ప్రసన్న కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/