క్షణాల్లో అమ్ముడైన రైలు టికెట్స్..రేపటి నుండి కౌంటర్లలో..త్వరలో మరిన్ని రైళ్లు!

Update: 2020-05-21 10:30 GMT
జూన్ 1 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్‌ లు గురువారం ఉదయం 10.00 గంటల నుంచి ప్రారంభించింది. బుకింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కేవలం రెండు గంటల్లోనే 1,49,025 టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టు రైల్వే శాఖ అధికార ప్రతినిథి వెల్లడించారు.

మొత్తం 73 రైళ్లకు టిక్కెట్స్‌కు రిజ్వర్వేషన్లు ప్రారంభించామని - మొత్తం 2,90,510 ప్రయాణికులకు సంబంధించి 1,49,510 టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో అతి త్వరలో మరికొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీనితో పాటు 2 - 3 రోజుల్లో టికెట్ బుకింగ్‌ ను కూడా కౌంటర్లలోనే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. త్వరలో మరికొన్ని రైళ్లను ప్రకటిస్తాం. భారత దేశంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుంది అని పీయూష్ గోయల్ చెప్పారు.

ఇప్పటి వరకు ఐఆర్‌ సీటీసీ ద్వారా మాత్రమే రైల్వే టికెట్లు బుకింగ్ జరుగుతోంది. రైల్వే కౌంటర్లలో జరగడం లేదు. ఇకపై రైల్వే కౌంటర్లలో కూడా టికెట్లు ఇస్తామని చెప్పారు. అయితే, అందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు ప్రకటించారు.ఈ రైళ్లకు సంబంధించిన టిక్కెట్లు 30 రోజుల ముందుగా రిజర్వేషన్ చేయించుకోచ్చు. నిబంధనల ప్రకారం ఆర్ ‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను కూడా జారీ చేస్తారు. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన మార్గాలను రైల్వే శాఖ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. స్లీపర్‌ క్లాస్ రిజర్వేషన్లు నిండిపోయినా 200 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది.
Tags:    

Similar News