అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యాపార పరంగానూ కలిసి రావడం లేదు. భారీ నష్టాల కారణంగా ట్రంప్ రియల్టీ వ్యాపారంలో భాగమైన ఓ లగ్జరీ హోటల్ను విక్రయించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వాషిగ్టన్ డీసీ లో ట్రంప్ ఇంటర్నేషనల్ పేరుతో 263 గదులు ఉన్న ఓ భారీ హోటల్ ను విక్రయించేందుకు కసరత్తు జరగుతున్నట్లు వాల్స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనంలో పేర్కొంది. దీని ప్రకారం.. ట్రంప్ గ్రూప్ మియామి కేంద్రంగా పని చేస్తున్న సీజీఐ మర్చంట్ గ్రూప్ తో ఈ డీల్ పై చర్చరిస్తున్నట్లు పేర్కొంది.
ఈ డీల్ విలువ 375 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ డీల్ పూర్తయితే హోటల్ పేరను వాలడ్రోఫ్ ఆస్టోరిగా మార్చనున్నారని సమాచారం. ఈ హోటల్ను హిల్టన్ గ్రూప్ నిర్వహించనుందని తెలిసింది. ట్రంప్ మద్దతుదారులలైన రిపబ్లికన్లకు, విదేశీ వ్యాపారులకు ఈ హోటల్ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ హోటల్ భవనాన్ని లీజుకు తీసుకుంది. దీనిని హిల్టన్ గ్రూప్ నిర్వహించనుంది. 263 గదులున్న ఈ భవనాన్ని ట్రంప్ ఆర్గనైజేషన్ 60 ఏళ్ల లీజుకు తీసుకొంది. 2016లో ఈ హోటల్ కార్యకలాపాలను ప్రారంభించింది. వాస్తవానికి రిపబ్లికన్లకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా నిలిచినా.. ఇటీవల కరోనా వ్యాప్తి కారణంగా భారీగా నష్టాలు వచ్చాయి. మొత్తం నష్టం 70 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఇటీవల బయటపడింది.
2019 నుంచే దీన్ని విక్రయించాలని నిర్ణయించినా..బయ్యర్లు లభించలేదు. తాజాగా మియామీకి చెందిన సీజీఐ మర్చంట్ గ్రూప్ దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి ఈ డీల్ పూర్తికావచ్చని వాల్ స్ట్రీట్ పేర్కొంది. శ్వేత సౌధానికి ఒక్క మైలు దూరంలోని పెన్సెల్వేనియా అవెన్యూలోని పోస్టాఫీస్ భవనం ఈ హోటల్‌గా మారింది. 2012లో దీనిని అభివృద్ధి చేసేందుకు అంగీకారం కుదిరింది. 2016లో ట్రంప్ నామినేషన్ వేసిన కొన్ని వారాల్లో ఈ హోటల్ పనిచేయడం మొదలైంది. అయితే కరోనా దెబ్బకి ట్రంప్ హోటల్ అప్పుల్లో కూరుకుపోవడం తో అమ్మేయడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.