టికెట్ల కోసం బాబుపై ఒత్తిడి

Update: 2019-03-02 10:45 GMT
సాధారణంగా అధికార పార్టీలో టికెట్ల కోసం నేతలు క్యూ కడుతుంటారు. అయితే టీడీపీలో ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. దీంతో ఎవరికీ టికెట్ కేయించాలో తెలియక బాబు సతమతమవుతున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీని బలహీన పర్చేందుకు బాబు ఇబ్బడి ముబ్బడిగా నేతలను లాగేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ వారికి టికెట్లు ఇవ్వలేక సతమతమవుతున్నారు. ఇక సిట్టింగ్ స్థానాల్లో సైతం ఇతర నేతలు దరఖాస్తులు చేస్తూ తమకే టికెట్ కేటాయించాలని కోరుతుండటం టీడీపీని ఆందోళనకు గురిచేస్తోంది.. అందరికీ న్యాయం చేస్తానని ప్రస్తుతానికి బాబు బుజ్జగిస్తున్నా టికెట్లు కేటాయించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో ఎన్నికల సమీపిస్తుండటంతో అధికార పార్టీకి నేతలు క్యూ కడుతున్నారు. అయితే పార్టీలో ఉన్నవారికి టికెట్ ఇవ్వాలా లేక ఇతర పార్టీ నుంచి వచ్చిన బలమైన నేతలకు టికెట్ ఇవ్వాలా అని బాబు తేల్చుకోలేకపో్తున్నాయి. ఇదిలా ఉంటే రోజురోజుకు టికెట్ ఆశించే వారి సంఖ్య బారెడు పెరిగిపోతుంది. కొందరు నేతలు ఓ రాయి వేస్తే తగలకా పోదా అన్నట్లు ట్రై చేస్తుండగా మరికొందరు నేతలు తప్పకుండా టీడీపీ టికెట్ మీదే పోటీ చేస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో టికెట్ ఆశిస్తున్న వారీ సంఖ్య భారీగా ఉంది. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ - ఆయన భార్య - మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రసాదుల కనక మహాలక్ష్మీ టీడీపీ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. కాగా ఈసారి అశోక్ గజపతి కూతురు అతిధి గజపతి ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత ఎమ్మెల్సే మీసాల గీత ప్రజలకు అందుబాటులో ఉండరనే ప్రచారం ఉండటంతో ఈ స్థానానికి పలువురు నేతలు పోటీపడుతూ ఉత్కంఠ రేపుతున్నారు.

అలాగే కురపాం నియోజకవర్గం - సాలురూ నియోజకవర్గం - చీపురుపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా తమకే సీటు కేటాయించాలని చంద్రబాబుపై పలువురు నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో త్వరలోనే సీట్ల ప్రక్రియను ముగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఉంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉండటంతో చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వారం రోజుల్లో అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


Tags:    

Similar News