తిరుపతి ఉప ఎన్నికకు సమరోత్సాహంతో సిద్ధమవుతోన్న అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గూడురు నియోజకవర్గంలో వైసీపీ కీలక నేత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు.
ఇటీవల కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాలతో బాధ కలిగించినట్లు చెప్పారు. పార్టీ కోసం శ్రమిస్తున్నా.. అసత్యపు ఆరోపణలు చేయడం.. తనపై దుష్ప్రచారం చేయడం వంటి కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరిశ్చంద్రరెడ్డి చెప్పుకొచ్చారు.
కుట్రలు, కుతంత్రాలు తనకు తెలియదని.. ఈ రంగంలో ఉండలేనని భావించి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు నుమూరి హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఇటీవల వరుస దురదృష్టకర ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
తన వల్ల గూడేరు ప్రజలకు ఏదైనా తప్పు జరిగి ఉంటే మన్నించాలని.. వైసీపీ చేరినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని విధాలుగా తనకు సహకరించిన కార్యకర్తలకు, నాయకులు, ప్రజలకు, పార్టీ అధినేత సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వైసీపీ అభిమానులు, కార్యకర్తలకు ఒకింత షాక్ తగిలినట్టైంది.