కట్టుకున్నవాడే తన భార్య పరువును బజారులో పెట్టాడు. తన అక్రమ సంబంధాన్ని నిలదీసిందన్న కక్షతో ఆమె నగ్న వీడియోలను పోర్న్ సైట్ లో పెట్టాడు. అంతటితో ఆగకుండా డబ్బుల కోసం తన భార్యే ఈ బూతు వీడియోలు తీసిందని ప్రచారం చేశాడు. భర్త చేసిన ఈ దారుణం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో చోటుచేసుకుంది.
కోల్ కతాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేసే వ్యక్తి కొంతకాలంగా భార్యకు తెలియకుండా తన ఆఫీసులో పనిచేసే ఒక యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన భార్య నిఘా పెట్టి భర్త అక్రమ సంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది.కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పి పంచాయితీ పెట్టింది.
ఇక తన పరువు తీసిన భార్యపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ఆ భర్త భావించాడు. భార్యకు తెలియకుండా బాత్రూమ్, బెడ్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టాడు. భార్య స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు మార్చుకున్న వీడియోలు పోర్న్ వెబ్ సైట్లో పెట్టాడు. ఆ లింకులను బంధువులకు పంపించి.. తన భార్య ఇలా డబ్బుల కోసం నగ్న వీడియోలు తీస్తోందని ప్రచారం చేశాడు.
ఇదంతా భర్త కుట్ర అని ఆ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పరిశోధించి ఇదంతా చేసింది భర్తే అని తేల్చారు. భర్తతో పాటు ప్రియురాలిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు.