ఎన్నిక ముగిసినా.. ఇంకా వేడి చ‌ల్లార‌లే!

Update: 2021-11-01 11:34 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాల‌ కు కార‌ణ‌మైన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఫ‌లితాలు న‌వంబ‌ర్ 2న అంటే మంగ‌ళ‌వారం విడుద‌ల కానున్నాయి. ఈ ఉప ఎన్నిక పోరు లో విజేత ఎవ‌రో? మ‌రొక్క రోజు లో తేలిపోనుంది. ఇక అంతా ప్ర‌శాంతం గానే ఉంటుంది అనుకునే లోపే ఆ వేడి చ‌ల్లార‌డం లేదు. వీవీ ప్యాట్స్ త‌ర‌లింపు లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని అధికార టీఆర్ఎస్ అక్ర‌మాల‌ కు పాల్ప‌డింద‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారికి బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫిర్యాదుల‌ పై నివేదిక ఇవ్వాల‌ని క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌, నియోజ‌క‌వ‌ర్గ ఎన్నికల అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి ఆదేశించారు. దీంతో ఆ ఎన్నిక వేడి మ‌రోసారి తీవ్ర‌మైంది.

భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌ తో టీఆర్ఎస్‌ను వీడిన ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి కి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ ఉప ఎన్నిక‌ లో ఈట‌ల‌ను ఎలాగైనా ఓడించాల‌ని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశారు. త‌మ పార్టీ త‌ర‌పున విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ ను బ‌రిలో దించి.. అక్క‌డ పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను మంత్రి హ‌రీశ్‌ రావు కు అప్ప‌గించారు. దీంతో అన్నీ తానై చూసుకున్న హ‌రీశ్ రావు.. ఈట‌ల‌ పై విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌ల‌తో రెచ్చిపోయారు. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ కు ఎంతో కీల‌క‌ మైన ఈ ఉప ఎన్నిక‌ల విజ‌యం కోసం ఈట‌ల కూడా శాయా శ‌క్తులా ప‌ని చేశారు. కాంగ్రెస్ పోటీ లో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన పోటీ టీఆర్ఎస్ వ‌ర్సెల్ ఈట‌ల అన్న‌ట్లు గానే సాగింది.

అక్టోబ‌ర్ 30న జ‌రిగిన పోలింగ్‌లో రికార్డు స్ధాయి పోలింగ్ న‌మోదైంది. పోలింగ్ ప్ర‌క్రియ మొత్తం మీద ప్ర‌శాంతం గానే ముగిసింది. కానీ పోలింగ్ ముగిసిన త‌ర్వాత రాత్రి వీవీ ప్యాట్ల త‌ర‌లింపు ప్ర‌క్రియ వివాదానికి దారితీసింది. వీవీ ప్యాట్ల‌ను బ‌స్సులో నుంచి దించి కార్లో కి ఎక్కించే వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో అధికార టీఆర్ఎస్ అక్ర‌మాల‌ కు పాల్ప‌డుతుందంటూ ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఈ విష‌యం పై బీజేపీ నాయ‌కులు ఎన్నిక‌ల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న నివేదిక అందించాల‌ని క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల అధికారుల‌ను ఆదేశించారు. అయితే ఓ బ‌స్సు టైరు కు పంక్చ‌ర్ కావ‌డం తో అందు లోని వీవీ ప్యాట్ల‌ ను కార్ల‌ లో త‌ర‌లించార‌ని పోలీసులు విచార‌ణ జ‌ర‌ప‌గా అది సాంకేతిక లోపం తో ప‌క్క‌న‌ పెట్టిన వీవీ ప్యాట్ అని తేలింద‌ని క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌త్య‌ నారాయ‌ణ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యం లో ఈ ప‌రిణామం ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందోన‌నే ఆస‌క్తి నెల‌కొంది.
Tags:    

Similar News